Begin typing your search above and press return to search.

జూన్ ని అనాధగా వదిలేశారే

By:  Tupaki Desk   |   5 May 2019 10:22 AM IST
జూన్ ని అనాధగా వదిలేశారే
X
టాలీవుడ్ లో సినిమాల విడుదల అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టు ఉంటాయి. ఒకేరోజు తలపడి ఒకరి వసూళ్ళను మరొకరు దెబ్బ తీసుకోవడమో లేదా మంచి సీజన్ ని ఎవరూ పట్టించుకోకుండా అలా వదిలేయడమో చూస్తూనే ఉన్నాం . ఇప్పుడు రాబోయే జూన్ లో అదే సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. కాకపోతే రివర్స్ లో.

జూన్ లో ఇప్పటిదాకా విడుదల ఖరారు చేసుకున్న మూవీ ఆరెక్స్ 100 ఫేం కార్తికేయ నటించిన హిప్పీ ఒక్కటే. జూన్ 7 డేట్ లాక్ చేశారు. దానిలో మార్పు ఉండే అవకాశం దాదాపు లేనట్టే. అంతకు రెండు రోజుల ముందు సల్మాన్ ఖాన్ భారత్ భారీ ఎత్తున విడుదల అవుతున్నా నిర్మాతలు హిప్ఫి మీద నమ్మకంతో ఉన్నారు. అది ఎలాగూ హింది మూవీ కాబట్టి ఇక్కడ మాస్ కు హిప్పీనే ఛాయస్ అవుతుందన్న నమ్మకం కావొచ్చు.

దీని తర్వాత ఇంకే తెలుగు సినిమా షెడ్యూల్ చేయలేదు. అర్జున్ రెడ్డి హింది రీమేక్ కబీర్ సింగ్ 21 వస్తోంది కాని మనవైపు దాన్ని పట్టించుకునే అవకాశాలు తక్కువే. కీలకమైన జూన్ ని ఇలా వదిలేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. మొదట మే 31 అనుకున్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ జూన్ లో వస్తుందేమో అని ఆశించారు అభిమానులు. కాని వాళ్ళ అంచనాలకు భిన్నంగా నిర్మాతలు జూలై ఎండింగ్ ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఇక నిఖిల్ అర్జున్ సురవరం అంత లేట్ గా వదలరు కాబట్టి అది మేలోనే వచ్చేస్తుంది కనక సమస్య లేదు. పూరి జగన్నాధ్- రామ్ ల ఫస్ట్ టైం కాంబోగా రూపొందుతున్న ఐస్మార్ట్ శంకర్ కూడా జూలైలోనే వచ్చే అవకాశం ఉందని వినికిడి. మొత్తానికి చూస్తుంటే వేసవిని ముగించే జూన్ అలా అనాధగా మిగిలిపోయేలా ఉంది.