Begin typing your search above and press return to search.

సెక్స్ సీన్స్ చేసేందుకు అభ్యంతరం లేదట!

By:  Tupaki Desk   |   20 Feb 2020 12:00 PM GMT
సెక్స్ సీన్స్ చేసేందుకు అభ్యంతరం లేదట!
X
సంప్రదాయవాదులు మండిపడొచ్చుగాక.. అభ్యుదయవాదుల ముసుగులో ఉండే కొందరు జఫ్ఫాలు గగ్గోలు పెట్టొచ్చుగాక.. కియారా మాత్రం అవేవీ పట్టించుకోకుండా బోల్డ్ హీరోయిన్ కు కొత్త అర్థం చెప్తోంది. ఈ భామ మెయిన్ స్ట్రీమ్ బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ హిట్లు సాధిస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ నెట్ ఫ్లిక్స్ వారి 'లస్ట్ స్టోరీస్' వెబ్ సీరీస్ లో వైబ్రేటర్ సీన్ తో సంచలనం సృష్టించింది. ఒక హీరోయిన్ ఇలా స్వయంతృప్తి సీన్ లో నటించడం. ఆహా ఊహు... అంటూ ఎక్స్ ప్రెషన్లు ఇవ్వడం అరాచకమే.

తాజాగా ఈ బ్యూటీ నెట్ ఫ్లిక్స్ వారి 'గిల్టీ' అనే మరో బోల్డ్ వెబ్ మూవీలో కూడా నటించింది. ఇలా వెబ్ మూవీస్ లో నటించడం గురించి మాట్లాడుతూ తనకు లస్ట్ స్టోరీస్ లో చిన్న పాత్ర చేసినప్పటికీ మంచి గుర్తింపు దక్కిందని.. నటనకు అవకాశం ఉండి.. గుర్తింపు దక్కుతూ ఉన్నప్పుడు ఎలాంటి ప్లాట్ ఫామ్ లో అయినా నటిస్తానని తెలిపింది. ఈ భామ అంతటితో ఆగలేదు. బోల్డ్ పాత్రల లో నటించేందుకు.. సెక్స్ సీన్లలో నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా స్పష్టం చేసింది.

అసలే బాలీవుడ్ ఫిలింమేకర్లు మహా ఘటికులు.. ఇలా సెక్స్ సీన్ల లో నటించేందుకు అభ్యంతరం లేదని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(NOC) ఇస్తే ఊరుకుంటారా? ఆ సీన్లు అవసరం అనిపించేలా కత్తిలాంటి కథలు రాసుకుని మరీ కియారా దగ్గరకు వస్తారు. ఇక కాచుకోండి నాయనలారా.. బేసిక్ ఇన్ స్టింక్ట్ లాంటి ఫసాక్ సినిమాలకు కియరా కేరాఫ్ అడ్రెస్ గా మారడం తథ్యం..!