Begin typing your search above and press return to search.
ఓవర్ అయిపోతోంది చెర్రీ!!!
By: Tupaki Desk | 16 Sep 2015 11:30 AM GMTమీడియం రేంజ్ హీరోతో తీస్తేనే.. శ్రీను వైట్ల సినిమాలో కుప్పలు తెప్పలుగా కేరక్టర్ ఆర్టిస్టులు కనిపిస్తారు. ఢీ నుంచి లేటెస్ట్ ఆగడు వరకూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు వైట్ల. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీ చేస్తున్నాడిపుడు. అందులోనూ ఆగడు డిజాస్టర్ దెబ్బకి.. తనని తాను ప్రూవ్ చేసేకునే కసితో ఉన్నాడు. అందుకే ఛాన్స్ దొరికినపుడుల్లా కొత్త కేరక్టర్ తో కొడుతున్నాడు. మామూలుగానే కాస్టింగ్, కేరక్టర్ లు కుమ్మేస్తాడు శ్రీనువైట్ల.
ఇప్పుడేమో రోజుకో కొత్త కేరక్టర్ ని ఎంటర్ చేసేస్తున్నాడు. తాజాగా టిస్కా చోప్రా బ్రూస్ లీ లో నటించనుందనే విషయం బయటకు వచ్చింది. కొంతమంది స్టార్ హీరోలు కూడా ఇలా వచ్చి అలా వెళ్లే రోల్స్ చేయబోతున్నారు. మెగాస్టార్ రోల్ ని 15 నిమిషాల పాటు ఉంచాలని నిర్ణయించి.. ఆ మేరకు నిడివి పెంచారు. ఈ మూవీలో కేరక్టర్ లని పరిచయం చేయాలంటే... మూడు నెలల ముందు నుంచే రోజుకో పాత్రని చెప్పాలేమో. మరి ఇంతమందిని ఎలా మేనేజ్ చేస్తాడో, ఎంతమందికి ప్రాధాన్యత గల పాత్రలు దక్కుతాయో అనే డౌట్ వినిపిస్తోంది.
కేరక్టర్ లు పెంచుకుంటూ పోయినంత మాత్రాన మూవీ డ్యురేషన్ ఇష్టం వచ్చినట్లుగా పెంచే ఛాన్స్ లేదు. 3 గంటల సినిమా అంటేనే అబ్బో అనే రోజులివి. అందులోనూ మల్టీప్లెక్స్ కల్చర్ పెరిగిపోయాక.. ఎక్కువ షోలు వేసుకునే వెసులుబాటు కోసం చిన్న సినిమాలు తీసేస్తున్నారు. ఇప్పుడు బ్రూస్ లీ లో ఇంతమంది కేరక్టర్ లనీ ఉంచేసి 3గంటలు కూర్చోపెడతారో.. ఎడిటింగ్ లో ఎన్ని సీన్స్ కు కత్తెర వేస్తారో అర్ధం కాని పరిస్థితి. మరి ఓవర్ అయిపోతే ఎవ్వరి క్యారెక్టర్ కూడా పూర్తి స్థాయిలో పండదేమో చెర్రీ!! థింక్ ఇట్!!