Begin typing your search above and press return to search.

#గుస‌గుస‌.. దర్శ‌కురాలు తానొక‌టి త‌లిస్తే ..!

By:  Tupaki Desk   |   14 Jan 2022 6:30 AM GMT
#గుస‌గుస‌.. దర్శ‌కురాలు తానొక‌టి త‌లిస్తే ..!
X
తానొక‌టి త‌లిస్తే దైవ‌మొక‌టి త‌లుచును! అన్న చందంగా స‌ద‌రు లేడీ డైరెక్ట‌ర్ స‌న్నివేశం క్ష‌ణాల్లోనే మారిపోయింది. ఓ బేబి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని తెర‌కెక్కించిన బి.వి.నందిని రెడ్డి వ‌రుస‌గా నాగ‌చైత‌న్య‌.. స‌మంత‌ల‌తో సినిమాలు తీయాల‌ని ఆశించారు. సామ్ తో వెంట‌నే మ‌రో చిత్రం ఉంటుంద‌ని స‌మంత‌-చైత‌న్య‌ను క‌లిపి ఏదైనా అద్భుత‌మైన స్క్రిప్టుతో సినిమా తీయాల‌ని క‌ల‌లు గ‌న్నారు. కానీ ఇంత‌లోనే ప‌రిణామాలు మారిపోయాయి.

తానొక‌టి త‌లిస్తే విధి ఇంకొక‌టి త‌ల‌చిన‌ది. ఆ ఇద్ద‌రూ ఇంత‌లోనే మ‌న‌స్ఫ‌ర్థ‌ల‌తో విడిపోవ‌డంతో స‌న్నివేశం మారిపోయింది. ఇప్పుడు త‌న‌కు ఆ ఇద్ద‌రితో ఛాన్సులు కూడా త‌గ్గిపోయాయ‌ని గుస‌గుస వినిపిస్తోంది. చై- సామ్ క‌లిసి ఉన్న‌ప్ప‌టి స‌న్నివేశం ఇప్పుడు లేద‌ట‌. ఇటీవ‌లి కాలంలో స‌మంత కెరీర్ ప‌రంగా వ‌రుస చిత్రాల‌తో బిజీ అయిపోవ‌డం ప‌నిలో ప‌నిగా బాలీవుడ్ వైపు దృష్టి సారించడంతో సీన్ అంతా రివ‌ర్స‌య్యింది. తెలుగు-త‌మిళం-హిందీలో అగ్ర బ్యాన‌ర్ల‌కు స‌మంత ఎడా పెడా సంత‌కాలు చేయ‌డంతో ఇవ‌న్నీ పూర్త‌య్యేప్ప‌టికే చాలా స‌మ‌యం ప‌డుతుంది.

అప్ప‌టివ‌ర‌కూ నందినిరెడ్డితో సినిమా చేయ‌డం క‌ష్టం. సమంతకు బాలీవుడ్ అరంగేట్రం.. పెద్ద తెలుగు చిత్రాలతో సహా చేతినిండా ప్రాజెక్ట్ లు ఉన్నాయని.. కాబట్టి ఆమె ప్రస్తుతం నందిని చిత్రాన్ని చేయ‌లేన‌ని తెలిపారని గుస‌గుస వినిపిస్తోంది.

చైత‌న్య అయినా నందిని రెడ్డితో సినిమా చేస్తాడ‌ని భావించినా అత‌డు ప్ర‌స్తుతం థాంక్యూ త‌ర్వాత బాలీవుడ్ లో వెబ్ సిరీస్ కి స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు. అమెజాన్ ప్రైమ్ కోసం హర్రర్ వెబ్ సిరీస్ ను పూర్తి చేస్తానని.. సర్కారు వారి పాట తర్వాత పరశురామ్ తదుపరి సెట్స్ లో జాయిన్ అవుతానని చైత‌న్య‌ స్పష్టం చేశాడు. అంటే వచ్చే రెండేళ్ల పాటు నందిని రెడ్డి సినిమా కోసం చై ఎలాంటి డేట్స్ కేటాయించలేని ప‌రిస్థితి ఉంద‌న్న‌మాట‌.

కార‌ణం ఏదైనా కానీ ఈ జంట‌తో ఇక ఇప్ప‌ట్లో ప‌న‌వ్వ‌ద‌ని తేలిపోయింది. నందిని ప్ర‌స్తుతం వేరొక యువ‌జంట‌తో సినిమా తీస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సంతోష్ శోభన్ -మాళవిక మీనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పెద్ద స్టార్ డ‌మ్ ఉన్న వారితో సినిమాలు చేయాలంటే నందిని న‌వ‌త‌రంతో మ‌ళ్లీ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంద‌న్న‌మాట‌.