Begin typing your search above and press return to search.
'లైగర్' క్లైమాక్స్ ఎవరూ గెస్ చేయలేరు: పూరి
By: Tupaki Desk | 20 Aug 2022 4:33 AM GMTపూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమా రూపొందింది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పూరి - విజయ్ దేవరకొండలను చార్మీ ఇంటర్వ్యూ చేసింది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ద్వారా కథ తెలియడం లేదనీ, పూరి మార్క్ డైలాగ్స్ కనిపించలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఉన్నట్టుగా ఫీడ్ బ్యాక్ వచ్చిందనే ప్రస్తావన చార్మీ తీసుకుని వచ్చింది. దీనికి కారణం ఏమిటని ఆమె పూరిని అడిగింది.
అందుకు పూరి స్పందిస్తూ .. "నా సినిమా అనగానే ఆడియన్స్ మాస్ డైలాగులు ఆశిస్తారు. నేని కూడా డైలాగ్స్ మీదనే ట్రైలర్ ను కట్ చేద్దామని అనుకున్నాను. కానీ ఈ సినిమాలో హీరోకి'నత్తి' .. అందువలన డైలాగ్స్ పై ట్రైలర్ ను రిలీజ్ చేయదలచుకోలేదు.
ఇక ఈ ట్రైలర్ చూస్తే కథ అర్థమవుతుంది. తల్లీ కోడులుకులిద్దరూ 'చాయ్' అమ్ముకుంటూ బ్రతుకుతుంటారు. అక్కడి నుంచి హీరో జర్నీ ఎలా మొదలైందనే విషయం ట్రైలర్ లో స్పష్టంగా అర్థమవుతుంది. కథ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు.
కరీంనగర్ కి చెందిన ఒక తల్లి తన కొడుకుని నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ గా చూడాలని అనుకుంటుంది. ఆ తల్లి కలను నిజం చేయడం కోసం ఆ కుర్రాడు ఎంతగా కష్టపడ్డాడు అనేదే కథ. ఇక ఈ సినిమాలో మైక్ టైసన్ కనిపిస్తాడు. ఆయన నటించిన ఫస్టు ఇండియన్ మూవీ ఇది. ఇది బాక్సింగ్ నేపథ్యంతో కూడిన సినిమా కావడం .. ఆయన ఈ సినిమాలో కనిపించడం చూసి ఏదేదో ఊహించుకోవద్దు. ట్రైలర్ లో ఆయనను కౌబోయ్ లుక్ తో చాలా సరదాగా చూపించాము .. ఆయన పాత్ర అలాగే ఉంటుందనుకుని థియేటర్స్ కి రండి.
ఈ మధ్య కాలంలో నాకు 'పుష్ప' క్లైమాక్స్ బాగా నచ్చింది. హీరో .. విలన్ కలిసి చాలా తాపీగా మాట్లాడుకోవడం నాకు చాలా కొత్తగా అనిపించింది. అలాగే ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ చాలా కొత్తగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కి సంబంధించిన ఆ సందర్భం కొత్తది.
అలాంటి ఒక సందర్భాన్ని ఇంతవరకూ ఏ సినిమాలోను చూసి ఉండరు. ఆ సందర్భం ఏమిటనేది సినిమా చూస్తే అర్థమవుతుంది" అంటూ చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. "ఫలానా సినిమా వస్తుంది .. మీరు థియేటర్ కి రండి అని చెప్పడమే టీజర్ల .. ట్రైలర్ల ఉద్దేశం. కథ చెప్పడం వాటి పని కాదు" అంటూ సమాధానమిచ్చాడు.