Begin typing your search above and press return to search.
300 మంది గాళ్స్ తో గడిపానంటే వదిలేశారు!
By: Tupaki Desk | 26 July 2019 1:30 AM GMT`అర్జున్ రెడ్డి` బాలీవుడ్ రీమేక్ `కబీర్ సింగ్` వివాదాల గురించి తెలిసిందే. ట్రోలింగ్ కల్చర్ విపరీతంగా ఉండే బాలీవుడ్ లో `కబీర్ సింగ్` వివాదాలు మోతెక్కించాయి. షాహిద్ తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సైతం వివాదాల్లోకి వచ్చారు. కబీర్ సింగ్ పై ముఖ్యంగా మహిళా మండళ్లు చెలరేగి విమర్శించాయి. అర్జున్ రెడ్డి హ్యాబిట్స్ గురించి ఆడాళ్లతో దురుసైన ప్రవర్తన పైనా.. చెంప దెబ్బలపైనా ఓ రేంజులో విరుచుకుపడ్డారు. ఇప్పటికీ ఈ సినిమాపై పలువురు మహిళలు వీరంగం వేయడం చర్చకొస్తోంది.
అయితే తన సినిమాని పదే పదే విమర్శిస్తున్న ఆడాళ్లపై షాహిద్ కాస్తంత అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఫలానా సినిమా కంటే మేం అసభ్యంగా ఏం చూపించాం! అంటూ ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది. సంజయ్ దత్ బయోపిక్ గా వచ్చిన `సంజూ` సినిమాలో ఓ డైలాగ్ ని ఉదహరిస్తూ అప్పుడు పట్టించుకోని వాళ్లు ఇప్పుడిలా నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు షాహిద్. సంజూ చిత్రంలో 300 మంది ఆడాళ్లతో గడిపానని హీరో డైలాగ్ చెబితే అప్పుడు వదిలేశారు. ఒక బయోపిక్ లోనే అలాంటి డైలాగ్ చెప్పించారు కదా? అది కనిపించలేదా? అని ప్రశ్నించారు. నా సినిమాపైనే గొడవకు ఎందుకు దిగుతున్నారు! అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు.
మొత్తానికి ఈ ఎపిసోడ్ లో షాహిద్ కడుపు మంట అవతలివారికి అర్థమైందో లేదో కానీ.. అసలు బాలీవుడ్ లో కబీర్ సింగ్ ని మించిన రా అండ్ రస్టిక్ సినిమాలెన్నో ఉన్నాయి. భరితెగించి వల్గారిటీని న్యూడిటీని ప్రమోల్ చేసినవి ఎన్నో. అయితే అప్పుడెపుడో లేని ట్రోలింగ్ కల్చర్.. భీభత్స భయానక కల్చర్ ఇప్పుడే ప్రవేశించింది. సోషల్ మీడియాతో పాటుగా ప్రతి ఒక్కరూ పబ్లిక్ లో మీడియాల ముందుకు వచ్చి ఈ తరహాలో వివాదాలు రాజేస్తున్నారన్నది బహుశా షాహిద్ ఆవేదన కావొచ్చు.