Begin typing your search above and press return to search.
పబ్‌లో దాడి ఘటనపై రాహుల్ సిప్లిగంజ్ తల్లి
By: Tupaki Desk | 8 March 2020 2:30 AM GMTబిగ్ బాస్ 3 విజేత - సింగర్ - నటుడు రాహుల్ సిప్లిగంజ్ పై హైదరాబాదులోని ఓ పబ్ లో ఇటీవల దాడి సంఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాహుల్ తల్లి స్పందించారు. ఆ రోజు సాయంత్రం రాహుల్ ఇంటి నుండి వెళ్లిపోయాడని - రాత్రి ఇంటికి రాలేదని - కానీ తండ్రితో ఫోన్ లో మాట్లాడినట్లు చెప్పారు. దాడి గురించి తమకు టీవీలో చూసే వరకు తెలియదన్నారు. తన కొడుకుపై దాడి జరిగిందని, ఆ తర్వాత ఆసుపత్రిలో చేరాడనే విషయాలు కూడా తెలియదని చెప్పారు. ఉదయం విషయం తెలియడంతో తన భర్త ఆసుపత్రికి వెళ్లాడన్నారు.
రాహుల్ సిప్లిగంజ్ బుధవారం రాత్రి కొందరు స్నేహితులతో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్ కు వెళ్లగా - దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడున్న కొంతమంది రాహుల్ వెంట వచ్చిన యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో అతను జోక్యం చేసుకున్నారు. ఇది చినికి చినికి వానయింది. రాహుల్ తలపై బీరు సీసాలతో దాడి చేశారు. అతనికి రక్తస్రావమైంది. ఈ ఘటన రాత్రి పదకొండు నలభై ఐదు నిమిషాలకు చోటు చేసుకుంది.
వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకొని, ఇంటికి వెళ్లిపోయాడు రాహుల్. అయితే ఈ దాడిపై రాహుల్ తొలుత ఫిర్యాదు చేయలేదు. పబ్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రాహుల్ గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులపై పిర్యాదు చేశారు. తన స్నేహితురాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించారని, దీనిపై ప్రశ్నిస్తే బీరు బాటిళ్లతో దాడి చేసినట్లు ఆరోపించారు.
ఆ తర్వాత రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై కావాలనే కొంతమంది బీరు బాటిల్ తో దాడి చేశారని, తలపై చిన్న గాయం అయిందని - వాళ్లు పదిమంది వరకు ఉన్నారని - అందరూ ఒకేసారి వచ్చి దాడి చేశారని, తనకు న్యాయం జరగడం కోసం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని తెలిపారు. దీనిపై వెనక్కి వెళ్లేది లేదన్నారు.