Begin typing your search above and press return to search.
MAA కు మాస్క్ ఏదీ.. డెల్టా ప్లస్ వస్తోంది తస్మాత్ జాగ్రత్త!
By: Tupaki Desk | 27 Jun 2021 2:30 AM GMTఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోలేదు.. వ్వాట్ ఈజ్ దిస్? ఎంత ఎన్నికలు అయితే మాత్రం ఇలా మాస్క్ అయినా లేకుండా అలా గుంపుగా ఓ చోట చేరి మీటింగులు పెడతారా? పెట్టారు సరే.. మాస్క్ ధరించేందుకు ఎందుకు నామోషీ?
మొదటి వేవ్ వెళ్లినా సెకండ్ వేవ్ వెళుతున్నా థర్డ్ వేవ్ కి ఇంకా అవకాశం ఉందన్న హెచ్చరికలు అందాయి. పైపెచ్చు మ్యూటెంట్ వైరస్ లు పురుడు పోసుకుని హడలెత్తిస్తున్నాయి. డెల్టా వైరస్ ని మించి డెల్టా ప్లస్ వైరస్ రంగంలోకి దిగింది. అప్పుడే ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలో కూడా ప్రవేశించింది. తెలంగాణలోనూ దీని గురించి వింటుంటే ధడెక్కిపోతోంది.
ఇలాంటి టైమ్ లో `మా అసోసియేషన్` ఎన్నికల హంగామా మొదలైంది. ప్రెస్ మీట్లు పెడితే కనీసం మాస్క్ కూడా ధరించలేదు. కేవలం ఒక్క గ్రూప్ ఫోటో కోసమే కదా మాస్క్ తీశాం అంటారా? ఆ ఒక్క ఫోటో తీసే టైమ్ చాలు డెల్టా వైరస్ చుట్టేయడానికి.. ఇంకా వైరస్ ఎటూ వెళ్లలేదు. రోజుకు 5000 కేసులు నమోదవుతున్నాయి. ఒక్క కేసుతో మొదలైన బయో వార్ ఇప్పటికీ ముగియలేదు. కరోనా పోయిందనుకున్నారా? వ్యాక్సిన్ వేయించామని ధీమానా? రెండు డోసులు వేశాకా వైరస్ సోకుతోంది.
ఇది మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. అంతం లేని ఈ వైరస్ ని దృష్టిలో పెట్టుకుని తస్మాత్ జాగ్రత్త అని అంతా హెచ్చరిస్తున్నారు. అసలు కరోనా వైరస్ ఇంతగా విజృంభించడానికి సెకండ్ వేవ్ రాకకు రాజకీయ నాయకుల స్వార్థపూరిత ప్రయోజనాలేనని అపవాదు ఉంది. ఎంత చెబుతున్నా పట్టించుకోకుండా ఎలక్షన్ పెట్టిన గవర్నమెంట్ పాపాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. అయినా ఇంకా బుద్ధి రాలేదు. ఇప్పుడు 950 మంది కోసం ఎన్నికలు ఇంత కేర్ లెస్ గా వ్యవహరిస్తే ఎలా? పరిశ్రమకే కదా ఇబ్బంది..! ప్చ్!!