Begin typing your search above and press return to search.

సుప్రీమ్ జడ్జ్ కేస్.. వ్యతిరేకిస్తున్న చిన్మయి

By:  Tupaki Desk   |   12 May 2019 9:38 AM GMT
సుప్రీమ్ జడ్జ్ కేస్.. వ్యతిరేకిస్తున్న చిన్మయి
X
సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గత కొంత కాలంగా లైంగిక వేధింపులకు సంబంధించిన అంశాలలో సోషల్ మీడియా ద్వారా తన స్పందను తెలుపుతూ ఉన్న సంగతి తెలిసిందే. మొదట్లో వైరముత్తుపై ఆరోపణలరో పారంభం అయిన ఈ #మీటూ ఎపిసోడ్ నెమ్మదిగా ఎవరికి లైంగిక వేధింపులు ఎదురైనా వారి గురించి తన స్పందన తెలపడం.. వారి తరఫున తన గళం వినిపించడం దిశగా సాగుతోంది.

ఈ క్రమంలో రీసెంట్ గా సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కేసుపై కూడా తన స్పందన తెలిపింది. రంజన్ గొగోయ్ పై ఆయన ఆఫీసులో పనిచేసే పని మనిషి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం.. ఆ పిటీషన్ ను సుప్రీమ్ కోర్టు విచారించిన మీదట రంజన్ కు క్లీన్ చిట్ ఇస్తూ కొట్టివేయడం తెలిసిన విషయాలే. ఈ వ్యవహారంలో ఢిల్లీలో కొందరు మహిళా మండలి సభ్యులు న్యాయస్థానం ఎదుట నిరసన కూడా నిర్వహించారు. ఈ కేసు విషయంలో సుప్రీమ్ తీర్పును చిన్మయి వ్యతిరేకిస్తోంది. రంజన్ గొగోయ్ పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. దీంతో కొందరు స్థానిక మహిళా మండలి సభ్యులతో కలిసి చెన్నైలోని వళ్లువర్‌ కోట్టం.. నుంగంబాకం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలని పోలీసులను అనుమతి కోరగా వారు నిరాకరించారు.

చెన్నై సిటీ పోలీస్ కమీషనర్ ఎకే విశ్వనాథన్ ఈ విషయంపై స్పందిస్తూ సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచిన తర్వాత దానికి వ్యతిరేకంగా అందోళనలు చేయడం కోర్టుధిక్కార నేరం కిందకు వస్తుంది. అందుకే చిన్మయికి అనుమతి నిరాకరించాల్సి వచ్చిందని వివరించారు. ఇదిలా ఉంటే ఆదివారం నాడు మరో ట్వీట్ లో చిన్మయి "చీఫ్ జస్టిస్ లైంగిక వేధింపుల కేసులో మేము పారదర్శకమైన విచారణ కోరుతున్నాం. ఇందుకోసం దయచేసి మీరందరూ ఉన్న చోటి నుండే సోషల్ మీడియాలో ఈరోజు 4 నుండి 5 గంటలో లోపు లైవ్ కు వచ్చి సంఘీభావం ప్రకటించండి" అని తెలిపింది.