Begin typing your search above and press return to search.

అర‌కులో ఫిలింహ‌బ్‌ కి అనుమ‌తి లేదు

By:  Tupaki Desk   |   4 Dec 2018 6:28 AM GMT
అర‌కులో ఫిలింహ‌బ్‌ కి అనుమ‌తి లేదు
X
బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో కొత్త టాలీవుడ్ పురోభివృద్ధికి ఉన్న ఆస్కారం ఏంటి? దీనిపై ప్ర‌భుత్వాల ఉద్ధేశం ఏంటి? అన్న‌దాని పై నిరంత‌రం విస్త్ర‌త చ‌ర్చ సాగుతోంది. అయితే కొత్త టాలీవుడ్‌ని నెల‌కొల్పాల్సి వ‌స్తే అందుకు అవ‌స‌ర‌మైన భూములు విశాఖ బీచ్ లో రామానాయుడు స్టూడియోస్ నుంచి అటువైపు భీమిలి- విజ‌య‌న‌గ‌రం రోడ్‌లోనే అనుకూలం. ఆల్ట‌ర్నేట్‌గా ఇంకో చోటు ఎక్క‌డ ఉంది? అని ప్ర‌శ్నిస్తే.. మెజారిటీ పార్ట్ షూటింగులు జ‌రిగే అర‌కు ప‌రిస‌రాల నుంచి కొండ‌ల దిగువ‌గా కొత్త వ‌ల‌స వ‌ర‌కూ వేల ఎక‌రాల పోడు భూమి ఉంది. ఇక్క‌డ కొత్త టాలీవుడ్ సెట‌ప్ చేస్తారా? అందుకు ప్ర‌భుత్వం వ‌ద్ద ప్ర‌ణాళిక ఉందా? ఇదే ప్ర‌శ్న అగ్ర నిర్మాత డి.సురేష్ బాబును ప్ర‌శ్నిస్తే ఆయ‌న ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు.

కొత్త వ‌ల‌స (వైజాగ్ ఆనుకుని ఉన్న టౌన్) నుంచి అర‌కు వెళ్లే వ‌ర‌కూ అదంతా వేల ఎక‌రాలు కొండ ప‌రిస‌రాల‌తో, ప‌చ్చందాల‌తో అల‌రారుతుంది. పైగా అది అట‌వీ శాఖ భూమి. పోడు వ్య‌వ‌సాయం ఉంది. ఇక్క‌డ ప‌రిస‌రాల్లో గిరిజనుల‌కు మాత్ర‌మే అనుకూలంగా జీవోలు ఉంటాయి. అక్క‌డ ఇత‌రుల ప్ర‌వేశం నిషిద్ధం. కొత్త ప‌రిశ్ర‌మ‌ను ఇలాంటి చోట ఏర్పాటు చేయ‌డం కుద‌ర‌దు. దీనికి ప్ర‌భుత్వ జీవోలు ఉండ‌వు.. అని అన్నారు.

అయితే రాజుగారే త‌ల‌చుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వా? రూల్స్ స‌డ‌లింపు ఉంటుంది క‌దా? అని ప్ర‌శ్నిస్తే అది రాబోవు ప్ర‌భుత్వంపైనా, కొత్త ప‌రిశ్ర‌మ ఏర్పాటుపై ఉన్న ఆస‌క్తిపైనా ఉంటుంద‌ని ప‌లువురు ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏదైనా 80 శాతం షూటింగులు వైజాగ్ - అర‌కు ప‌రిస‌రాల్లోనే జ‌రుగుతున్నాయి. బీచ్ అందం షూటింగులకు ప్ల‌స్ అవుతోంది. అన్నిటికీ అనుకూలమైన ప్ర‌దేశం అది. అక్క‌డి నుంచి అమ‌రావ‌తికి సూప‌ర్‌ఫాస్ట్ ట్రైన్‌లో 3-4గంట‌ల జ‌ర్నీనే. కాబ‌ట్టి అక్క‌డ కొత్త ప‌రిశ్ర‌మ అనుకూలం.. అని విశ్లేషిస్తున్నారు. టాలీవుడ్‌ కి సంబంధించి ఇటీవ‌ల 80శాతం షూటింగులు వైజాగ్-అర‌కు కేంద్రంగానే చిత్రీక‌రిస్తున్నారు. ఒడియా, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ చిత్రాల్ని ఇక్క‌డే ఎక్కువ‌గా చిత్రీక‌రిస్తున్నారు. అయినా వైజాగ్ ప‌రిశ్ర‌మ‌ పై ఎలాంటి క్లారిటీ రాలేదింకా. అయితే ప‌రిశ్ర‌మ అమ‌రావ‌తిలోనా? వైజాగ్‌లోనా? అన్న క్లారిటీ లేద‌ని, ఈ విష‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నాన్చుడు ధోర‌ణితో తాత్సారం చేస్తోంద‌ని, ప‌రిశ్ర‌మ ఆలోచ‌న‌ను రియ‌ల్ ఎస్టేట్ అనుకూల ప‌రిశ్ర‌మ‌గా మార్చే ఆస్కారం ఉంద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.