Begin typing your search above and press return to search.
ఎక్స్ ట్రా షోల అనుమతి రాలేదింకా
By: Tupaki Desk | 2 May 2019 9:53 AM GMTభారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ ముందు గేమ్ ప్లాన్ తెలిసిందే. భారీగా టిక్కెట్టు ధర పెంచడం.. తొలి వీకెండ్ స్పెషల్ షోలు ఏర్పాటు చేయడం.. పెట్టుబడుల్ని తొలి వీకెండ్ లోనే తిరిగి రాబట్టుకోవడం.. అన్న ప్రాతిపదిక చాలా కాలంగా చూస్తున్నదే. అందుకు ప్రభుత్వాల నుంచి అనుమతులు వస్తున్నాయి. ఎక్స్ ట్రా షోలు.. ఫ్యాన్స్ స్పెషల్ షోలు.. ప్రీమియర్లు అంటూ నానా రచ్చ ఉంటుంది. 2019 సంక్రాంతికి రిలీజైన వినయ విధేయ రామ - ఎఫ్ 2 - కథానాయకుడు చిత్రాలకు భారీగానే ప్రీమియర్ షోలు వేశారు. సంక్రాంతి ఊపులో టిక్కెట్టు ధరలు పెంచి వసూలు చేశారు. పండగలు- పబ్బాలకు భారీ రేంజు సినిమాలకు ప్రతిసారీ ఇదే పద్ధతి అమల్లో ఉంది. రామ్ చరణ్ - ఎన్టీఆర్- ప్రభాస్- మహేష్- అల్లు అర్జున్ వంటి స్టార్ల సినిమాలకు ఈ పద్ధతిని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. మరి తాజాగా బరిలో దిగుతున్న `మహర్షి` సన్నివేశమేంటి?
ఈ సమ్మర్ లో రిలీజవుతున్న తొలి భారీ చిత్రమిది. మహేష్ లాంటి సూపర్ స్టార్ నటించడంతో సర్వత్రా క్రేజు నెలకొంది. ఇక ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు పైమాటేనన్న ప్రచారం మరోవైపు హోరెత్తిపోతోంది. ముగ్గురు భాగస్వాములు రాజీ లేకుండా పెట్టుబడులు కుమ్మరించారన్న ముచ్చటా సాగుతోంది. అంత మొత్తాన్ని తిరిగి రికవరీ చేయాలంటే.. అందుకు తగ్గట్టే టిక్కెట్టు రేట్లు పెంచాలి. అదనపు షోలు వేయాలి. అందుకు ఇప్పటి నుంచే పీవీపీ - దిల్ రాజు బృందం ఏపీలో టిక్కెట్టు ధరలు.. స్పెషల్ షోల విషయమై సీరియస్ గానే ట్రై చేస్తున్నారని తెలిసింది. అలాగే మహర్షి టిక్కెట్ అన్ని నగరాల్లో రూ.200 ఫ్లాట్ గా ధర ఉండాలని ప్రభుత్వాన్ని కోరనున్నారట. ఇప్పటికే అందుకోసం అధికారికంగా ధరఖాస్తులు పెట్టారు.
నిన్న సాయంత్రం రిలీజైన మహర్షి ట్రైలర్ కి అభిమానుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ ట్రైలర్ క్లాస్సీగా ఉందని.. స్నేహం నేపథ్యంలో క్లాస్ టచ్ ఉన్న చిత్రమిదని టాక్ వచ్చింది. విద్యార్థిగా.. రైతన్నగా.. రియల్ కార్పొరెట్ ఛాలెంజర్ గా మహేష్ మూడు రూపాల్లో కనిపిస్తున్నారు. నరేష్ కాస్తంత సీరియస్ గెటప్ లో కనిపిస్తుంటే.. పూజా పాత్ర జోవియల్ గా ఎలివేట్ అయ్యింది. అందరి గెటప్పులకు స్పందన బావుంది. ఇప్పటికే ట్రైలర్ ని 40 లక్షల మంది వీక్షించారు. యూట్యూబ్ లో జెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది. మే 9న `మహర్షి` ప్రపంచ వ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే.