Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: థియేటర్లకు మళ్లీ అనుమతులు ఇవ్వలేదు
By: Tupaki Desk | 29 Aug 2020 4:00 PM GMTకేంద్రం అన్ లాక్-4 మార్గదర్శకాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. సెప్టెంబర్ 1 నుంచి అన్ లాక్-4 దేశంలో అమలు కాబోతోంది. ఈ క్రమంలోనే శనివారం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 30 వరకు అమలులోకి ఉంటాయని తెలిపింది.
అయితే దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి ఇచ్చింది. 21 నుంచి క్రీడలు, ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలకు కూడా అనుమతిచ్చింది. సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ 100 మందికే హాజరు కండీషన్ పెట్టింది.
అయితే దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న వినోదరంగమైన సినిమాలు, థియేటర్లు ఓపెన్ పై మాత్రం కేంద్రం నీళ్లు చల్లింది. థియేటర్లు ఓపెన్ సెప్టెంబర్ 30వరకు తెరిచేది లేదని స్పష్టం చేసింది. వాటితోపాటు స్కూళ్లు, కాలేజీలు, ఎడ్యూకేషన్ , కోచింగ్ ఇన్ స్టిట్యూట్ లను మూసే ఉంచాలని స్పష్టం చేసింది.
వేల కోట్ల వ్యాపారం జరిగే సినీ ఇండస్ట్రీ పీకల్లోతు కష్టాల్లో ఉంది. అది ఓపెన్ అయితే ప్రజలకు వినోదంపాటు దాని మీద ఆధారపడి ఉన్న కోట్ల కుటుంబాలు బతుకుతాయి. కానీ కరోనా కారణంగా థియేటర్లను ఓపెన్ చేసే సాహసం కేంద్రం చేయడం లేదు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన సినిమాలు థియేటర్స్ లో విడుదల చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ప్రకటనతో అవి ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. సెప్టెంబర్ 30 వరకు థియేటర్లు తెరవరు అని తెలిశాక సినీ అభిమానులు, ఇండస్ట్రీ నిరుత్సాహంలో మునిగిపోయారు.