Begin typing your search above and press return to search.
రవితేజను తిట్టనైనా తిడుతున్నారు..
By: Tupaki Desk | 27 May 2018 4:22 AM GMTవరుసగా రెండో వారం కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోతోంది. గత వారం కొత్త తెలుగు సినిమాలేవీ లేకపోవడం మూవీ గోయర్లను నిరాశ పరిస్తే.. ఈ వారం వచ్చిన రెండు సినిమాలూ కంటెంట్ పరంగా వాళ్లను నిరాశకు గురి చేశాయి. శుక్రవారం విడుదలైన ‘నేల టిక్కెట్టు’.. ‘అమ్మమ్మగారిల్లు’ రెంటి మీదా పెద్దగా బజ్ లేదు. తక్కువ అంచనాల మధ్య ఈ సినిమాలు రిలీజయ్యాయి. వాటికి తగ్గట్లే టాక్ కూడా వచ్చింది. ఈ రెండు సినిమాలకూ ఓపెనింగ్స్ పూర్ గా ఉన్నాయి. వీకెండ్లోనే పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ఇక సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. ఏం చేసినా ఈ సినిమాల్ని కాపాడే పరిస్థితి కనిపించడం లేదు.
ఇక ఈ రెండు సినిమాల్లో ఎక్కువ మంది చర్చల్లో నానుతున్నది ‘నేలటిక్కెట్టు’నే. ఈ సినిమా విషయంలో ఇటు హీరో రవితేజను.. అటు దర్శకుడు కళ్యాణ్ కృష్ణను ప్రేక్షకులు తిడుతున్నారు. వరుసగా రొటీన్ సినిమాలు చేసి ఫెయిల్యూర్లు ఎదురవుతున్నా మాస్ రాజా మారకపోవడాన్ని తప్పుబడుతున్నారు. మరోవైపు ‘సోగ్గాడే చిన్నినాయనా’.. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లాంటి సూపర్ హిట్ల తర్వాత ఇలాంటి సినిమా ఏంటని కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు. ఈ సినిమా ఎంత పేలవంగా ఉందో కూడా చెబుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఐతే నెగెటివ్ గా అయినా ఈ సినిమా గురించి కనీసం చర్చ ఉంది. కానీ నాగశౌర్య సినిమా ‘అమ్మమ్మగారిల్లు’ విషయంలో అసలు డిస్కషనే లేదు. ఆ సినిమా గురించి మాట్లాడే నాథుడే కనిపించడం లేదు.
‘నేల టిక్కెట్టు’తో పోలిస్తే ఈ సినిమా బెటరే అంటున్నారు. కానీ మామూలుగా చూస్తే దాన్ని భరించడమూ కష్టమే. సీరియల్ తరహాలో చాలా నాటకీయంగా.. నెమ్మదిగా సాగే సినిమా అది. యూత్ ఆడియన్స్ అసలేమాత్రం దాని వైపు చూడటం లేదు. ఆ టైటిల్.. దాని ప్రోమోలు అన్నీ కూడా యువ ప్రేక్షకుల అభిరుచికి దూరంగా కనిపించాయి. ఉన్నట్లుండి రిలీజ్ డేట్ ఇచ్చి పెద్దగా ప్రమోషన్లు లేకుండానే రిలీజ్ చేయడంతో మినిమం బజ్ కరవైంది. ఇక టాక్ అంతంతమాత్రంగా ఉండటంతో సినిమా డిస్కషన్లలోనే లేదు. ఇక వసూళ్ల సంగతైతే చెప్పాల్సిన పని లేదు.