Begin typing your search above and press return to search.
బజ్ లేదు.. ఎండ రావట్లేదు
By: Tupaki Desk | 18 July 2017 12:30 AM GMTఇప్పుడు త్వరలో రిలీజ్ కాబోయే సినిమాల పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే మారేలా ఉంది. ఎందుకంటే ఆపకుండా పడుతున్న కుండపోత వర్షాలను చూస్తుంటే.. అసలు ప్రేక్షకులు ధియేటర్లకు పరిగెత్తుకుంటూ రావడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది. ఈ తరుణంలో ఇప్పుడు ఆ సినిమాలకు బజ్ కూడా లేదనుకోండి.. అబ్బే అది కాస్త కష్టమైన విషయమే. ఉదాహరణకు ఫిదా సినిమాను తీసుకుందాం.
సడన్ గా ఆడియో ఫంక్షన్ తో కాస్త బజ్ క్రియేట్ చేసిన 'ఫిదా' ఎందుకోగాని తరువాత అంతగా ఆకర్షించలేకపోతోంది ఫిదా. ఒక ప్రక్కన పేపర్లలో ఫుల్ పేజీ యాడ్లు ఇస్తున్నా కూడా.. సినిమాపై అంతగా పాజిటివ్ బజ్ మాత్రం రాలేదు. అదీ కాకుండా శేఖర్ కమ్ముల గత చిత్రాలు సూపర్ ఫ్లాపులు కావడం ఒక మైనస్ అయితే.. వరుణ్ తేజ్ కూడా వరుసగా ఫ్లాపులే డెలివర్ చేయడం మనో మైనస్. వెరసి సినిమాను అంచనాలకు దూరంగా నెట్టేశాయి. అంతే కాదు.. ఇప్పుడు బజ్ లేకపోవడానికి తోడు వర్షం ఓవర్ గా పడుతోంది కాబట్టి.. ఈ శుక్రవారం ధియేటర్ కు వచ్చే సినిమాకంటే జనాలు గొడుగులూ రెయిన్ కోట్లు గురించే ఎక్కువగా డిస్కస్ చేసుకుంటున్నారు.
ఇప్పటికి వరుసగా చాలా ఫ్లాపులు తీసిన శేఖర్ కమ్ములకు.. అసలు మాంచి హిట్టనేదే చేతిలో లేని వరుణ్ తేజ్ కు.. ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. దిల్ రాజు కు అవసరమే కాని.. ఆయనకు ఈ సినిమా కాకపోతే లైన్లో 'రాజా ది గ్రేట్' ఉంది.. అది కాకపోతే ఇంకోటి. కాబట్టి ''ఫిదా'' సినిమాకు మాంచి బజ్ వచ్చేలా వీళ్లు ఏమన్నా ప్లాన్ చేస్తారేమో చూద్దాం. ఈలోపు వర్షంపోయి ఎండ కూడా వస్తే.. ధియేటర్లకు జనాలు ఆటోమ్యాటిక్ గా వెళతారులే.