Begin typing your search above and press return to search.
నీవెవరో అడిగేవారెవరో!
By: Tupaki Desk | 24 July 2018 1:30 AM GMTఇప్పుడున్న పరిస్థితుల్లో హీరో ఎవరైనా సినిమాను జనంలోకి బలంగా తీసుకెళ్లడం చాలా ముఖ్యం. ఈ విషయంలో స్టార్ హీరోలు సైతం చాలా అలెర్ట్ గా ఉన్నారు. కానీ ఒక అప్ కమింగ్ హీరోను లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో విలన్ గానో చేస్తున్న నటుడితో హీరోగా సినిమా తీసినప్పుడు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ నీవెవరో యూనిట్ మాత్రం ఈ విషయంలో నిర్లిప్తంగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. నిజానికి ఆది పినిశెట్టి ఎంట్రీ హీరోగానే జరిగింది. మృగం-ఏకవీర-మలుపు లాంటి సినిమాలు పేరు తీసుకొచ్చాయి కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు దాంతో పాటు మార్కెట్ ను ఇవ్వలేకపోయాయి.
అందుకే చాలా తక్కువ టైంలో ఆది పినిశెట్టి క్యారెక్టర్ రోల్స్ వైపు మళ్లాడు. ఆ క్రమంలో చేసిన సరైనోడు విలన్ గా పెద్ద బ్రేక్ ఇవ్వగా ఈ మధ్య వచ్చిన రంగస్థలంలో చేసిన హీరో అన్నయ్య కుమార్ బాబు పాత్ర నటన పరంగా ఎన్నో మెట్లు పైకి ఎక్కించేసింది. ఈ నేపధ్యంలో ఆదిని సోలో హీరోగా ఒప్పుకుంటారా అనేది వేయి డాలర్ల ప్రశ్న. దానికి తోడు హీరోయిన్లు ఇద్దరూ తాప్సీ పన్ను-రితిక సింగ్ ఇద్దరికీ గ్లామర్ పరంగా ప్రత్యేకమైన ఫాలోయింగ్ అంటూ ఏదీ లేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య నీవెవరోకు ఓపెనింగ్స్ రావడం చాలా కీలకం. కోనవెంకట్ బ్రాండ్ ఉన్నప్పటికీ అదేమీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రేక్షకులు కానీ ఆసక్తి చూపే ఫ్యాక్టర్ కాదు. దానికి తోడు ఇందులో హీరో పాత్ర కళ్ళు కనపడని అంధుడి పాత్ర కావడం కూడా రిస్క్ తో కూడుకున్నదే. ఎందుకంటే కళ్ళు కనిపించని హీరో పాత్రలు సక్సెస్ కావడం చాలా అరుదు.
అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం కమల్ హాసన్ అమావాస్య చంద్రుడు తర్వాత ఎవరూ అంత సాహసం చేయలేకపోయారు. గత ఏడాది రాజ్ తరుణ్ ఆంధగాడు చేసాడు కానీ ఫలితం ఫెయిల్యూర్ రూపంలోనే దక్కింది. రెగ్యులర్ థ్రిల్లర్ తరహాలో అనిపిస్తున్న నీవెవరోలో మరి అంతగా మెప్పించే అంశాలు ఏమున్నాయా అనే సందేహం రావడం సహజం. వీటికి ప్రమోషన్ ద్వారా సరైన సమాధానం ఇవ్వగలిగితే అంతో ఇంతో ఆసక్తి కలుగుతుంది. అలా కాకుండా సైలెంట్ గా నీవెవరో చూడండి అంటే వచ్చేవారెవరో అంటుంది ట్రేడ్.