Begin typing your search above and press return to search.

రీమేక్ కు పాన్ ఇండియా వైడ్ ప్రమోషన్స్ అనవసరం అనుకున్నారేమో..?

By:  Tupaki Desk   |   22 Dec 2021 3:30 AM GMT
రీమేక్ కు పాన్ ఇండియా వైడ్ ప్రమోషన్స్ అనవసరం అనుకున్నారేమో..?
X
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ - మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ''జెర్సీ''. తెలుగులో నాని హీరోగా నటించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ కి ఇది అధికారిక హిందీ రీమేక్. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంటర్ అవుతున్నారు.

హిందీ 'జెర్సీ' చిత్రాన్ని అల్లు ఎంటర్టైన్మెంట్స్ - దిల్ రాజు ప్రొడక్షన్ - సితార ఎంటర్టైన్మెంట్స్ - బ్రాట్ ప్రొడక్షన్స్ సంస్థలు రూపొందించాయి. అల్లు అరవింద్ సమర్పణలో దిల్ రాజు - సూర్యదేవర నాగవంశీ - అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించారు. బన్నీ వాసు ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు.

కరోనా పాండమిక్ పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నిర్మించిన సినిమా కావడంతో తెలుగులోనూ 'జెర్సీ' సినిమాకి ప్రచారం లభించింది. అయితే ట్రైలర్ రిలీజ్ తరువాత ఈ మూవీ సౌండింగ్ లోకల్ లో బాగా తగ్గిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తెలుగు రీమేక్ సినిమా కావడంతో హిందీ 'జెర్సీ' ని అనవసరంగా పాన్ ఇండియా వైడ్ ప్రమోట్ చేయడం ఎందుకనే ఉద్దేశంతోనే.. నిర్మాతలు ఇప్పుడు హిందీలోనే ఈ సినిమాను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారట. మరి ఈ చిత్రం మన తెలుగు నిర్మాతలకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

కాగా, హిందీ 'జెర్సీ' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ - స్పెషల్ పోస్టర్స్ - సాంగ్స్ బాలీవుడ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ రాబోయే రోజుల్లో అగ్రెసివ్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. సచేత్-పరంపర ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. అనిరుధ్ రవిచంద్రన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. అనిల్ మెహతా సినిమాటోగ్రఫీ అందించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.