Begin typing your search above and press return to search.
ఆటగాళ్ల సౌండ్ లేదేంటబ్బా!
By: Tupaki Desk | 22 Aug 2018 10:24 AM GMTహీరో ఎవరైనా సరే ఒక కొత్త సినిమా వస్తోంది అంటే అది జనంలో రిజిస్టర్ అయితే తప్ప కనీస ఓపెనింగ్స్ రాలేని పరిస్థితి ఉందిప్పుడు. అలాంటిది చడీచప్పుడు లేకుండా ఒక బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో ఒక స్టార్ విలన్ కాంబోలో మూవీ వస్తోంది అంటే ఎంత హడావిడి ఉండాలి. కానీ ఎల్లుండి విడుదల కాబోతున్న ఆటగాళ్లు విషయంలో అదేమి కనిపించడం లేదు. నారా రోహిత్ హీరోగా మరో కీలకపాత్రలో జగపతి బాబు నటిస్తున్న ఈ మూవీకి పరుచూరి మురళి దర్శకుడు. బరిలో ఆది పినిశెట్టి నీవెవరో ప్రభుదేవా లక్ష్మి గట్టి సవాలే విసురుతున్నాయి. ప్రమోషన్ కూడా బాగానే చేసుకుంటున్నాయి. మరి ఆటగాళ్లు ఇంత నిర్లిప్తంగా ఉండటం వెనుక పరమార్థం అర్థం కావడం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటాడు అనే పేరున్నప్పటికీ నారా రోహిత్ ఇంకా క్రౌడ్ పుల్లర్ స్టేజి కి చేరుకోలేదు. బాగుంది అనే టాక్ వస్తేనే మూడో రోజో నాలుగో రోజో జనం థియేటర్ దాకా కదల్లేరు. అలాంటిది పబ్లిసిటీ విషయంలో ఇంత డల్ గా ఉండటం ఖచ్చితంగా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపుతుంది.
క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఆటగాళ్లు రోహిత్ జగపతి బాబుల మధ్య మైండ్ గేమ్ మీద స్క్రీన్ ప్లే బలంతో తీసానని దర్శకుడు చెబుతున్నాడు. మరోవైపు అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన నాగార్జున క్రిమినల్ ఛాయలు ఇందులో ఉన్నాయని మరో టాక్ వినిపిస్తోంది. భార్యను హత్య చేసిన కేసులో తప్పించుకుని అసలు నేరస్థులను పట్టుకునే హీరోగా నాగ్ అతన్ని పట్టుకునే పనిలో పడ్డ ఆఫీసర్ గా నాజర్ తరహాలోనే ఇందులో రోహిత్ జగపతి బాబు పాత్రలు డిజైన్ చేసారని చెప్పుకుంటున్నారు కానీ ఫైనల్ గా సినిమా చూసాకే దీని గురించిన కామెంట్ నిజమా కాదా అనేది తేలుతుంది. ఒకపక్క గీత గోవిందం రచ్చ కొనసాగుతుండగా మరోవైపు మూడు సినిమాలు పోటీగా ఉన్న టైంలో ఆటగాళ్లు ఇలా సైలెంట్ గా రావడం వెనుక కారణం ఏంటబ్బా. దర్శకుడు పరుచూరి మురళి గతంలో గోపీచంద్ తో ఆంధ్రుడు బాలకృష్ణతో అధినాయకుడు తీసిన అనుభవం ఉంది. మొదటిసారి థ్రిల్లర్ ట్రై చేసిన మురళి రిజల్ట్ మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. చూద్దాం.