Begin typing your search above and press return to search.
సూర్యకు ఓకే.. రజనీకి మాత్రం లేదా?
By: Tupaki Desk | 25 Dec 2018 1:30 AM GMTతమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగు నిర్మాతలు ఉలిక్కి పడటం ఎప్పట్నుంచో ఉంది. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తోందంటే.. దానికి పోటీగా తెలుగు చిత్రాల్ని విడుదల చేయరు. ఆయన నటించిన ‘బాషా’.. ‘నరసింహా’.. ‘చంద్రముఖి’.. ‘శివాజీ’.. ‘రోబో’ లాంటి సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి తెలుగులో. తాజాగా ‘2.0’ సైతం దాని స్థాయిలో అది అదరగొట్టింది. ఐతే రజనీ కొత్త సినిమా ‘పేట్ట’ను తెలుగులో రిలీజ్ చేసే విషయంలో మాత్రం సస్పెన్స్ నడుస్తోంది. ‘బాషా’ తర్వాత ప్రతి రజనీ సినిమా కూడా తమిళంతో పాటు ఒకేసారి తెలుగులోనూ రిలీజవుతోంది. ఈ విషయంలో మరో ఆలోచన ఉండట్లేదు. కానీ ‘పేట్ట’ మాత్రం తమిళంతో పాటు ఒకేసారి తెలుగులో రిలీజవుతుందా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. తమిళ వెర్షన్‌ను సంక్రాంతికి షెడ్యూల్ చేసి జోరుగా ప్రమోషన్ కూడా చేస్తున్నారు.
కానీ తెలుగు వెర్షన్‌కు సంబంధించి ఒక్క అప్ డేట్ కూడా లేదు. ఈ చిత్ర డబ్బింగ్ హక్కుల్ని వల్లభనేని అశోక్ తీసుకున్నట్లు ఇటీవలే వెల్లడైంది. కానీ అంతకుమించి ఏ సమాచారం లేదు. తమిళంలో జనవరి 10న రిలీజ్ అంటున్నారు. అంటే ఇంకో 17 రోజులు మాత్రమే సమయం ఉంది. కానీ ఇప్పటిదాకా తెలుగులో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. సైలెంటుగా డబ్బింగ్ పనులు చేయిస్తున్న అశోక్.. రిలీజ్ సంగతి తేలాకే ప్రమోషన్లు మొదలుపెట్టాలనుకుంటున్నారట. ముందు ఆ విషయంలో క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి తక్కువ సంఖ్యలో థియేటర్లు ఇచ్చినా చాలంటున్నారట. కానీ సంక్రాంతి సినిమాల నిర్మాతలు మాత్రం ససేమిరా అంటున్నారట. అందరూ పెద్ద వాళ్లే కావడంతో రజనీ సినిమాకు ఛాన్సే లేకుండా ఒత్తిడి తెస్తున్నారట. సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలకు రిలీజ్ కాకుండా గతంలో తెచ్చిన నిబంధనను ముందుకు తెస్తున్నారట. కానీ గత ఏడాది సూర్య నటించిన డబ్బింగ్ సినిమా ‘గ్యాంగ్’ను సంక్రాంతికే రిలీజ్ చేశారు. ఆ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాకప్ తో యువి క్రియేషన్స్ వాళ్లు రిలీజ్ చేశారు. వాళ్లకు మాత్రం నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చినపుడు తనకు ఎందుకు ఇవ్వరంటూ అశోక్ లాజిక్ తీస్తున్నట్లు సమాచారం. ఆయన వాదనలో న్యాయం ఉంది కాబట్టి ‘పేట్ట’కు లైన్ క్లియర్ చేయక తప్పదు. మరి ఏమవుతుందో చూడాలి.