Begin typing your search above and press return to search.
ఇంతకీ వస్తోంది సూర్య సినిమానేనా?
By: Tupaki Desk | 23 May 2019 4:41 AM GMTగజినీ తర్వాత తెలుగులోనూ సూర్య మార్కెట్ పెరిగిపోయింది. ఒక టైంలో అది ఏ స్థాయికి చేరుకుందంటే అతని బిలో యావరేజ్ తమిళ సినిమాలు డబ్బింగ్ చేసినా నిర్మాతలకు లాభాలు వచ్చేవి. ఇప్పుడు సీన్ రివర్స్. గత కొన్నేళ్లుగా తీసికట్టు కథలతో మూసగా మారిపోయిన హరి మార్కు పోలీస్ సింగంలతో మనవాళ్లకు బొత్తిగా నచ్చడం మానేశాడు.
గత ఏడాది గ్యాంగ్ అందుకే తమిళ్ లో దక్కించుకున్న ఫలితంలో సగం కూడా అందుకోలేదు. సరే ఇది స్టార్ హీరోల విషయంలో మాములే అనుకోవచ్చు. కానీ ఇంకో వారంలో రిలీజవుతున్న ఎన్జికే (నంద గోపాల కుమార)గురించి ఎక్కడ ఎలాంటి సందడి కనిపించడం లేదు. డబ్బింగ్ అయినా స్వయంగా హైదరాబాద్ వచ్చి ప్రమోషన్ లో పాల్గొనే సూర్య ఇప్పటి దాకా ఇది నా సినిమానే కాదు అన్నట్టు వ్యవహరిస్తున్నాడు
సాయి పల్లవి రకుల్ ప్రీత్ సింగ్ లాంటి గ్లామర్ తారలు ఉన్న అడ్వాంటేజ్ ని సైతం మేకర్స్ వాడుకోవడం లేదు. అక్కడ తమిళనాడులో చూస్తేనేమో కనివిని ఎరుగని స్థాయిలో దీని రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అభిమానులు ఏకంగా రెండు వందల అడుగుల కటవుట్ కూడా రెడీ చేశారు. యుఎస్ లో సైతం రికార్డు స్థాయిలో ప్రీమియర్లు పడబోతున్నాయి. ఇదంతా చూస్తుంటే తెలుగు హక్కులు దక్కించుకున్న నిర్మాత ఎందుకింత స్తబ్దుగా ఉన్నారో అర్థం కావడం లేదు.
దీని కారణంగానే రాజశేఖర్ కల్కిని పోస్ట్ పోన్ చేశారని ఇప్పటికే టాక్ ఉంది. అలాంటప్పుడు పోటీ లేని ఈ అవకాశాన్ని వాడుకోవాలి కానీ ఇలా సైలెంట్ ఉంటే ఎలా అని నిలదీస్తున్నారు సూర్య ఫ్యాన్స్. ఇంకో వారం రోజుల పాటు భీభత్సమైన ప్రమోషన్ చేస్తే తప్ప డీసెంట్ ఓపెనింగ్స్ ఆశించలేని పరిస్థితి