Begin typing your search above and press return to search.

వాయిదా లేదు అరవింద దసరాకే

By:  Tupaki Desk   |   1 Sep 2018 7:45 AM GMT
వాయిదా లేదు అరవింద దసరాకే
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ' ను దసరా సీజన్ లో రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఎన్టీఆర్ నాన్నగారు నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణంతో ఎన్టీఆర్ కు పెద్ద కష్టం వచ్చింది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనడం కష్టమని దాంతో 'అరవింద సమేత' రిలీజును వాయిదా వేస్తారని మీడియాలో ప్రచారం సాగింది.

ఇప్పటికే టైట్ డెడ్ లైన్స్ తో షూటింగ్ జరుపుకుంటున్న 'అరవింద సమేత' టీమ్ కు కొత్త ఇబ్బంది రావడంతో ఇక సినిమా దసరాకు రావడం కష్టమేనని అనుకున్నారు. ప్రొడ్యూసర్ రాధాకృష్ణ కూడా వాయిదా వేసేందుకు ముందుకు వచ్చారట. కానీ ఎన్టీఆర్ మాత్రం తన వల్ల సినిమా రిలీజ్ వాయిదా వేయాలనే ఆలోచన వద్దని శనివారం నుండే షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధం అయ్యాడు. దశదిన కర్మ రోజుతప్ప మరో సెలవు లేకుండా షూటింగ్ లో పాల్గొనాలని ఎన్టీఆర్ అనుకున్నట్టుగా సమాచారం అందుతోంది.

మరోవైపు త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ ఆలోచనకు తగ్గట్టే సెప్టెంబర్ చివరిలోపే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేలా ఒక యాక్షన్ ప్లాన్ ను రెడీ చేసి పెట్టాడట. ఇక నిర్మాతలు ముందుగా అనుకున్న సమయానికే ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అక్టోబర్ 10 లేదా 11 న సినిమా రిలీజ్ అవుతుందని టాక్.