Begin typing your search above and press return to search.

రూపాయి తీస్కోకుండా సమంత యాక్టింగ్

By:  Tupaki Desk   |   27 April 2018 10:16 AM GMT
రూపాయి తీస్కోకుండా సమంత యాక్టింగ్
X
ఇవాల్టి రోజుల్లో రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా చేయడం అంటే అదో విడ్డూరం అనే చెప్పాలి. ఇలాంటివి గతంలో కనిపించేవి కానీ.. ఇప్పుడు అస్సలే మాత్రం ఇలాంటి ఫ్రీ సర్వీసులు కనిపించడం లేదు. నిజానికి ఇప్పుడు అక్కినేని సమంత కూడా ఉచిత సేవ ఏమీ చేయడం లేదులెండి.

కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన యూ-టర్న్ మూవీని తెలుగు అండ్ తమిళ్ లో సమంత ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సామ్ ఒక్క పైసా పారితోషికం పుచ్చుకోకుండానే మూవీ చేస్తోందట. అలాగని ఉచితంగా సినిమా చేసే ఉద్దేశ్యం ఏమీ లేదు కానీ.. ఈ సినిమా బడ్జెట్ ను వీలైనంత కంట్రోల్ లో ఉంచాలన్నది మేకర్స్ అండ్ సామ్ ఆలోచన. అందుకే రెమ్యూనరేషన్ సంగతి పక్కన పెట్టేసి సినిమా చేసేస్తున్నారు.

వీరి అగ్రిమెంట్ ప్రకారం.. సినిమా అంతా పూర్తయిపోయి.. రిలీజ్ అయిన తర్వాత.. లాభాలు వచ్చిన పిమ్మట.. అపుడు వాటిలో వాటాలను పుచ్చుకుంటుందట సమంత. ఇప్పటివరకూ స్టార్ హీరోలు ఇలా చేయడం అడపా దడపా కనిపించింది. కొన్ని ఏరియాల రైట్స్ తీసుకోవడం.. లేకుండా నిర్మాణంలో భాగం కావడం వంటివి చేశారు. ఇప్పుడు తొలిసారిగా సమంత ఇలాంటి ఫీట్ సాధిస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని.. వీలైనంత త్వరగా పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు.