Begin typing your search above and press return to search.
బ్రేకప్ అయితే రొమాన్స్ వద్దా?
By: Tupaki Desk | 18 Dec 2016 5:30 PM GMTఅయినా ఇలాంటి డౌట్లెందుకు వస్తాయని తెగ బాధపడిపోయేవారికి... బాలీవుడ్ స్టార్లు రణబీర్ కపూర్ - కత్రినా కైఫ్ లను చూస్తే మాత్రం... ఇలాంటి డౌట్లు రావడం నిజమే సుమా అని అనుకోకుండా ఉండలేరు. ఎందుకంటే నిన్నటిదాకా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ క్యూట్ జంట ఇప్పుడు అసలు కలుసుకోవట్లేదు. అంతేనా మాట్లాడుకోవడమూ లేదట. కలుసుకోవడాలు, మాట్లాడుకోవడాలు లేకరపోతే... రొమాన్స్ ఎలా పండుతుంది? నిజ జీవితంలో పండకున్నా... కనీసం సిల్వర్ స్క్రీన్ పై అయినా పండుతుందా? అంటే ఏమో చెప్పలేమంటున్నారు బాలీవుడ్ జనాలు. అయినా అసలు విషయం చెప్పకుండా ఈ లాగుడేంది అనేగా. అయితే అసలు విషయంలోకి వచ్చేద్దాం.
నిన్నటిదాకా బీచుల వెంట తిరిగి నిండా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన రణబీర్ - కత్రినాలు ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అన్న వార్తలు వినిపించాయి. అసలు వారు ప్రమేలో ఎంత మునిగిపోయారంటే.. రణబీర్ వెంట కత్రినా బీచుల్లో బికినీలతో పరుగులు పెట్టేంతగా. పెళ్లెప్పుడంటూ జనం ఆరాలు పేరాలు తీయకముందే వారిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారట. కారణమేంటో తెలియదు కాని... వారిద్దరి లవ్ జర్నీకి ఎంతగా అయితే ప్రాధాన్యం దక్కిందో - వారి బ్రేకప్ కు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చింది మీడియా. నిన్నటిదాకా ప్రేమ పక్షుల్లా తిరిగిన వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారన్న ఈ వార్తలు బీ టౌన్ కు షాకిచ్చాయనే చెప్పాలి. ఇక వీరి బ్రేకప్ అయితే నిజమేనని తేలిపోయిన తర్వాత... వారిద్దరూ కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. అనురాగ్ బసు దర్శకత్వంతో తెకరెక్కుతున్న జగ్గా జాసూస్ చిత్రంలో ఈ బ్రేకప్ జంట కలిసి నటిస్తోంది. వారి బ్రేకప్ కు నిదర్శనంగా ఈ చిత్రంలో అసలు రొమాంటిక్ సన్నివేశాలే లేవట. చిత్రంలో కావాలని రొమాన్స్ కు చోటివ్వలేదన్న వాదన వినిపిస్తోంది. సై-ఫైగా వస్తున్ ఈ థ్రిల్లర్ మూవీలో అసలు రొమాన్స్‌కే చోటు లేదట. దీంతోనే లవ్ బర్డ్స్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట... ఈ చిత్రంలో ఎడమొఖం పెడమొఖంగానే కనిపిస్తారట. అయినా మాస్ మసాలాలు అలవాటైన బాలీవుడ్ జనాలను రొమాన్స్ సీన్స్ లేని ఈ చిత్రంతో బసు మెప్పిస్తాడా? అన్న అనుమానాలు లేకపోలేదు. ఇదే డౌటు వచ్చిన బసు కూడా వారిద్దరితో ఓ ప్రమోషనల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. మరి ఈ పాటలోనైనా... రణబీర్ - కత్రినాల మధ్య రొమాన్స్ పండుతుందా? లేదా? అని బీ టౌన్ గుసగుసలాడుకుంటుందోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/