Begin typing your search above and press return to search.
`భీమ్లా నాయక్` రన్ టైమ్ లాక్ చేశారా?
By: Tupaki Desk | 8 Dec 2021 2:30 PM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం `భీమ్లా నాయక్`. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. సాగర్ వి. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. రానా దగ్గుబాటి తొలి సారి పవర్ స్టార్ తో కలిసి వర్క్ చేసిన సినిమా ఇది. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లు గా నటించారు. దీంతో సహజంగానే ఈ చిత్రంపై అంచనాలు స్కై హైకి చేరుకున్నాయి.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో మాసీవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిర్మించారు. తెలుగులో సినిమా ప్రారంభం నుంచి హాట్ టాపిక్ గా మారిన ఈ మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే ఈ చిత్ర రిలీజ్ డేట్ ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా వెళ్లిడిస్తూ సెట్ లో పవన్ కల్యాణ్ తో వున్న ఓ ఫొటోని షేర్ చేసిన విషయం తెలిసిందే.
రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్పీడుతో జరుగుతోంది. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. సినిమాలో ఐటమ్ నంబర్స్ కానీ డ్యూయెట్స్ కానీ లేకపోవడంతో ఈ సినిమా రన్ టైమ్ ని 2 గంటల 20 నిమిషాలకు లాక్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ వున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇలా రన్ టైమ్ ని లాక్ చేయడం వల్ల సినిమా ఎలాంటి లాగ్ లేకుండా ఇంట్రెస్టింగ్ గా సాగుతుందని, అదే సినిమాకు ప్లాస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం.