Begin typing your search above and press return to search.

పెద్ద తెర రిజల్ట్ అంత ప‌ని చేసిందా?

By:  Tupaki Desk   |   12 April 2020 1:10 PM GMT
పెద్ద తెర రిజల్ట్ అంత ప‌ని చేసిందా?
X
ఒకే ఒక్క హిట్టు ఎన్నో స‌మీక‌ర‌ణాల్ని మార్చేస్తుంది. ముఖ్యంగా బిజినెస్ సర్కిల్స్ లో కొత్త క‌ళ రావాలంటే స‌క్సెస్ త‌ప్ప‌నిస‌రి. ఒక‌వేళ ఫ్లాపు వ‌స్తే ఇక చేసేదేమీ ఉండ‌దు. యావ‌రేజ్ టాక్ వ‌ల్ల పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండదు. అందుకే ఇటీవ‌లి కాలంలో ఏ హీరో అయినా హిట్టు కావాల్సిందేనన్న పట్టుద‌ల క‌న‌బ‌రుస్తున్నారు. ఎంచుకునే క‌థ కంటెంట్ స‌హా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒక‌సారి ఏదో ఒక కార‌ణంతో మార్కెట్ పూర్తిగా ప‌డిపోతే ఆ ప్ర‌భావం థియేట్రిక‌ల్ బిజినెస్ స‌హా శాటిలైట్ .. డ‌బ్బింగ్ రైట్స్ పైనా ప‌డుతోంది. హీరోల స‌క్సెస్ రేటును బ‌ట్టి కూడా ఇవ‌న్నీ ప్ర‌భావితం అవుతుంటాయి. అందుకే ఎంతో కేర్ తీసుకుంటున్నారు.

ఇక ఇటీవ‌లి కాలంలో చాలా సినిమాల‌కు శాటిలైట్ బిజినెస్ పూర్తి కావ‌డం లేదు. రిలీజ్ ముందే శాటిలైట్ రైట్స్ అమ్మేశారంటే ఆయా సినిమాల‌పై బ‌జ్ ఆ రేంజులో ఉంద‌నే అర్థం. ఒకవేళ బేరం తెగ‌లేదు అంటే ఆ మూవీ రేంజును మించి శాటిలైట్ హ‌క్కుల‌కు డిమాండ్ చేస్తున్నార‌నే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కోవ‌లోనే ఇటీవ‌లే రిలీజైన క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ `హిట్` కి నిర్మాత లు భారీ మొత్తాన్నే డిమాండ్ చేయ‌డంతో ఇప్ప‌టికీ శాటిలైట్ అమ్మ‌కాలు సాగ‌లేద‌ని తెలుస్తోంది. ఈ సినిమాని నాని స‌మ‌ర్పిస్తే.. ఆయ‌న డిజైన‌ర్ ప్ర‌శాంతి త్రిపుర‌నేని నిర్మించారు. రిలీజ్ అనంత‌రం కేవ‌లం నెల‌రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. దీంతో చాలా మంది ఆడియెన్ ఈ మూవీని చూసేశారు. అలాగే ఈ సినిమాతో పాటు నానీ నిర్మించిన అవార్డ్ కేట‌గిరీ చిత్రం `అ!` శాటిలైట్ హ‌క్కుల్ని విక్ర‌యించ‌లేద‌ని తెలుస్తోంది. నానీ ఎక్కువ డిమాండ్ చేస్తుండ‌డంతో ఎంట‌ర్ టైన్ మెంట్ చానెళ్లు ఏవీ కొన‌డం లేదుట.

అయితే ఈ జోన‌ర్ సినిమాలు పెద్ద తెరపై మెప్పించినంత‌గా... బుల్లితెర‌పై మెప్పించే వీల్లేదు. కుటుంబ స‌మేతంగా వీక్షించే కంటెంట్ క్రైమ్ జోన‌ర్ కి ఉండ‌దు. ఇక అ! సినిమా సైకో పాథిక్ థ్రిల్ల‌ర్ త‌ర‌హా చిత్రం. బుల్లితెర‌పై ఏ మేర‌కు ఆద‌రణ ఉంటుంది అన్న‌దానిపైనా రైట్స్ కొనుక్కునే వాళ్ల‌కు సందేహాలుండొచ్చు. మ‌రి అందుకే ఇలా సెల్లింగ్ పాయింట్ వ‌ద్ద నానీ టీమ్ వీక్ అయిపోయింద‌ని భావించ‌వ‌చ్చు. ఇక ఈ రెండు సినిమాల‌కు సీక్వెల్స్ తీస్తాం అంటూ ప్ర‌చారం చేసుకున్నా.. అలాంటి ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం కూడా మైన‌స్ అనే చెప్పాలి.