Begin typing your search above and press return to search.

తొలి ప్రేమ.. జస్ట్ టైటిల్ మాత్రమే

By:  Tupaki Desk   |   6 Sep 2017 8:44 AM GMT
తొలి ప్రేమ.. జస్ట్ టైటిల్ మాత్రమే
X
మెగా హీరో వరుణ్‌ తేజ్ మరోసారి ప్రయోగాల జోలికి పోకుండా.. చక్కగా తనకు అచ్చొచ్చిన సాఫ్ట్ జానర్ లో ఇప్పుడు మరో లవ్ స్టోరీ చేస్తున్నాడు. మొత్తానికి లోఫర్ వంటి రొటీన్ యాక్షన్ కథలతో గాట్టిగా దెబ్బలు తినేశాక.. ఫిదా సినిమా మనోడికి పెద్ద హిట్టు రూపంలో రిలీఫ్‌ ఇవ్వడమే కాకుండా బాగా కళ్ళు తెరిపించేసింది కూడా. అందుకే వెంటనే మరో లవ్ స్టోరీయే చేస్తున్నాడు.

కొత్త కుర్రాడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో వరుణ్‌ తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు 'తొలిప్రేమ' అనే టైటిల్ ను పెట్టనున్నట్లు మొన్ననే ఒక న్యూస్ వచ్చింది. అయితే సాధారణంగా 'తొలిప్రేమ' అంటే మనకు రెండు విషయాలు గుర్తొస్తాయి. ఒకటి పవన్ కళ్యాణ్‌ నటించిన సూపర్ హిట్ సినిమా.. అలాగే ఒక టాప్ క్లాస్ లవ్ స్టోరి. కాని చాలామందికి మాత్రం ఈ టైటిల్ పెట్టారంటే ఇది ఆ సినిమాకు రీమేకా అనే సందేహం వచ్చింది. కాని అస్సలు ఆ తొలిప్రేమకూ ఈ తొలిప్రేమకూ ఎటువంటి సంబంధం లేదంట.

''నిజానికి వరుణ్‌ తేజ్ ఈ సినిమాలో తొలిసారిగా తన జీవితంలో ఒకమ్మాయితో ప్రేమలో పడతాడు. బ్రేకప్ అవుతుంది. తిరిగి తన ప్రేమను పొందడానికి ఏం చేశాడనేదే కథ. అందుకే తొలిప్రేమ అయితే బాగుంటుందని ఆ కథను తీసుకున్నాం. అంతేకాని వరుణ్‌ బాబాయ్ పవన్ కళ్యాణ్‌ సినిమాకూ దీనికీ ఏం సంబంధం లేదు'' అంటూ ఒక సన్నిహితుడు సెలవిచ్చాడు.

ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న వరుణ్‌ తొలిప్రేమ ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం లండన్ వెళ్లనుంది. ఏకంగా ఓ నెల రోజులు అక్కడే షూటింగ్. అది సంగతి.