Begin typing your search above and press return to search.
సైలెంట్ అయిన సరిలేరు.. ఎగసెగసి పడుతున్న అల!
By: Tupaki Desk | 3 Feb 2020 5:00 AM GMTసంక్రాంతి సినిమాలు రిలీజై ఇప్పటికి దాదాపుగా మూడు వారాలు. పేరుకు నాలుగు సినిమాలు విడుదలయ్యాయి కానీ ప్రధాన పోటీ మాత్రం మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' మధ్య ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దర్బార్ ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.. 'ఎంత మంచివాడవురా' మంచితనం మరీ ఎక్కువ కావడంతో జనాలకు కనెక్ట్ కాలేదు. అయితే మహేష్.. అల్లు అర్జున్ సినిమాల మధ్య పోటీ మాత్రం ఇండియా - పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ను తలపించింది.
ప్రతి విషయంలో పోటీనే. పోస్టర్ల విడుదల.. లిరికల్ సాంగ్స్ హంగామా.. రిలీజ్ డేట్ల గొడవ.. థియేటర్ల కోసం రచ్చ.. ఫేక్ కలెక్షన్స్ నంబర్ల ప్రమోషన్ ఇలా ఎవరూ ఎవరికీ తీసిపోలేదు. అయితే ఈ పోటీలో నిజమైన విజేతగా నిలిచింది మాత్రం అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'. ఇందులో ఎవరికీ అనుమానం లేదు. అయితే 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోకుండా తమ సినిమానే విజేత అని ప్రేక్షకులను నమ్మించే ప్రయత్నాలు చాలా చేశారు. అయితే ఒక దశ దాటిన తర్వాత ఆ ప్రచారం మరీ కామెడీగా మారిపోయింది. సినిమాలో కంటే బయట కామెడీ ఎక్కువగా ఉందనే సెటైర్లు కూడా పడ్డాయి. ఈ విషయం గుర్తించారేమో కానీ సైలెంట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపుగా బ్రేకీవెన్ అయింది. అమెరికాలో మాత్రం నష్టాలు తప్పలేదు.
ఇదిలా ఉంటే 'అల వైకుంఠపురములో' ప్రమోషన్స్ రోజులు గడిచేకొద్ది పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. ఈ సినిమా సంక్రాంతి విన్నర్ అనే సంగతి అందరూ ఒప్పుకుంటారు కానీ ప్రచారం చేసుకున్నంత రేంజ్ లో 'అల వైకుంఠపురములో' కలెక్షన్స్ లేవనేది ట్రేడ్ వర్గాల మాట. ఈ సినిమాను నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అంటూ బాకా ఊదుకుంటున్నారు కానీ ఈ సినిమా కలెక్షన్స్ 'రంగస్థలం' వసూళ్లను దాటలేదని ఇప్పటికే అధిక శాతం ప్రేక్షకులు నమ్ముతున్నారు. ఒక సక్సెస్ మీట్ పెడితేనే జనాలు అసహనం వ్యక్తం చేస్తుంటే.. అదేపనిగా సక్సెస్ మీట్లు పెట్టడం ఇండస్ట్రీ హిట్.. ఇండస్ట్రీ హిట్ అని జపం చెయ్యడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. పెద్ద పెద్ద ఇండస్ట్రీ హిట్లు కొట్టిన వారే సైలెంట్ గా తమపని చేసుకుంటూ వెళ్తారని.. దొరక్క దొరక్క ఒక హిట్ దొరికిన హీరోలా ఈ హంగామా ఏంటి అంటూ అల్లు అర్జున్ పై సెటైర్లు వేస్తున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్ లను చూసి అల్లు అర్జున్ నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుచేస్తున్నారు.
ఏదేమైనా ఇద్దరు హీరోలు సంక్రాంతి హంగామా ఎలా ఉండాలో సరిగ్గా చూపించారు. హంగామా కొంచెం ఓవర్ కూడా అయింది. సందడి వరకూ సరే కానీ మేమే గొప్ప మేము మాత్రమే గొప్ప అని ప్రచారం చేసుకోవడం మాత్రం ఎక్కువ మంది ప్రేక్షకులకు నచ్చడం లేదు. మరి ఈ విషయం సంక్రాంతి హీరోలు గుర్తిస్తారో లేదో.