Begin typing your search above and press return to search.
స్టార్ హీరోయిన్లు మాయమైపోయారే
By: Tupaki Desk | 17 Sep 2015 4:38 AM GMTఒక్కసారిగా నాలుగు కొత్త సినిమాలు లుక్కులు రిలీజ్ అయ్యాయి. బాలయ్య డిక్టేటర్ - రజనీకాంత్ కబాలి - అఖిల్ కొత్త సినిమా పోస్టర్లు, కమల్ చీకటి రాజ్యం.. ఇలా సడన్ గా గణేషుడిని స్తుతించడానికి నాలుగు ఫస్ట్ లుక్కులు వచ్చేశాయి. అయితే ఈ సినిమాల తాలూకు లుక్కుల్లో ఎక్కువగా హీరోలదే పైచేయి అయినా.. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చేయొచ్చు మనం.
అసలు విషయం ఏంటంటే.. ఈ నాలుగు సినిమాల్లో ఒక్క దానిలో కూడా స్టార్ హీరోయిన్లు మాత్రం లేరు. డిక్టేటర్ సినిమాలో బాలయ్య సరసన ఒక హీరోయిన్ గా అంజలి, మరో స్పైసీ బ్యూటి సోనాల్ చౌహాన్ ఒక కీలక్ రోల్ లో చేస్తున్నారు. ఇద్దరూ కూడా పాపులర్ బ్యూటీలే కాని సూపర్ స్టార్లు మాత్రం కాదు. ఒకవేళ ఈ సినిమా హిట్టు పడితే మాత్రం వీళ్ళ పొజిషన్ ఎక్కడో ఉంటుంది. ఇక రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె కూడా చాలా కన్వెన్షనల్ గా ఉండే నార్మల్ బ్యూటీయే తప్ప స్టార్ కాదు. మరి మన కమల్ పక్కన? హీరోయినే లేదు. ఫేడవుట్ అవుతున్న త్రిష ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తుంటే, మధుశాలినీ ఇంకో రోల్ చేస్తోంది. అఖిల్ బాబు సరసన కొత్తమ్మాయ్ సాయేషా సైగల్ చిందేస్తోంది.
ఓ విధంగా చూస్తే ఇంత క్రేజ్ వచ్చిన ఈ కొత్త సినిమాల్లో అసలు సూపర్ లేడీస్ లేరనమాట. అంటే ఒక్కోసారి పెద్ద పెద్ద సూపర్ స్టార్ హీరోయిన్లు లేకపోయినా కూడా సినిమాలో కంటెంట్ ఉంటే చాలు వర్కవుట్ అయిపోతుంది. దర్శకులూ ఇదీ గుర్తు పెట్టుకోండి మరి.. కోట్లు కోట్లు పెట్టి ఫ్యామస్ భామలను దించడం కాదు.