Begin typing your search above and press return to search.
మహేష్ 26కి ముహూర్తం కుదిరింది
By: Tupaki Desk | 29 May 2019 7:56 AM GMTఎప్పుడెప్పుడా అని సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్న మహేష్ 26 ఇంకో మూడు రోజుల్లోనే ప్రారంభం కానుంది. మే 31న పూజా కార్యక్రమాలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారు. ఈ మేరకు నిర్మాత అనిల్ సుంకర తరఫున ఏకే సంస్థ సోషల్ మీడియా అప్ డేట్స్ లో ఇది వచ్చేసింది. రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్ నెలాఖరు నుంచి ఉంటుంది. ఇప్పటికే అనిల్ రావిపూడి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్టు తెలిసింది.
మహేష్ పూర్తిగా విని ఫైనల్ వెర్షన్ ఓకే చేశాక ప్రీ ప్రొడక్షన్ ని వేగవంతం చేస్తారు. రాయలసీమతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు కీలకమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకోబోతున్న ఈ మూవీని అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం. హీరొయిన్ గా రష్మిక మందన్న ఫైనల్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ మరోసారి స్వరాలు సమకూరుస్తున్నాడు. భరత్ అనే నేను మహర్షి తర్వాత హీరో మ్యూజిక్ డైరెక్టర్ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ.
అనిల్ రావిపూడి లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్ ఎఫ్2కి మ్యూజిక్ ఇచ్చింది కూడా దేవినే. మొత్తానికి క్రేజీ కాంబోతో మహేష్ 26కి రంగం రెడీ అవుతోంది. సరిలేరు నీకెవ్వరు-రెడ్డి గారి అబ్బాయి అనే రెండు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి కాని అనిల్ రావిపూడి మనసులో ఏదుందో ఇంకా బయటికి రాలేదు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ మూవీని భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నారు. లేడీ అమితాబ్ గా పేరున్న సీనియర్ హీరొయిన్ విజయశాంతి దీని ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇది 31న అధికారికంగా ప్రకటించాక క్లారిటీ వస్తుంది