Begin typing your search above and press return to search.

నాని హీరోయిన్‌కు అవ‌కాశాలు రావ‌డం లేదా?

By:  Tupaki Desk   |   3 Feb 2022 1:30 AM GMT
నాని హీరోయిన్‌కు అవ‌కాశాలు రావ‌డం లేదా?
X
కొంత మంది హీరోయిన్ లు బాగున్నా అవ‌కాశాలు రావు .. కానీ కొంత మందికి అవ‌కాశాలు వ‌చ్చినా వాటిని నిల‌బెట్టుకోలేరు. దాంతో వారి కెరీర్ ప్ర‌శ్నార్థ‌కంగా మారుతూ వుంటుంది. అయినా స‌రే కాంప్ర‌మైజ్ కాకుండా తాము అనుకున్న దానికే మొండిగా ఫిక్స‌వుతూ అంది వ‌చ్చిన అవ‌కావాల్ని జార‌విడుచుకుంటుంటారు ప్రస్తుతం ఇదే ప‌రిస్థితిని ఎదుర్కుంటోంది. నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన చిత్రం `నానీస్ గ్యాంగ్ లీడ‌ర్‌`. `మ‌నం` ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌రావాలేద‌నిపించింది.

ఇదే మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది ప్రియాంక అరుళ్ మోహ‌న్‌. తొలి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న ప్రియాంక‌కు తెలుగులో శ‌ర్వానంద్ న‌టించిన `శ్రీ‌కారం` త‌రువాత మ‌రో చిత్రం రాలేదు. అందం, అంత‌కు మించిన అభిన‌యం ఆమె సొంతం అయినా ఆమెని టాలీవుడ్ లో అవ‌కాశాలుఏ వ‌రించ‌డం లేదు.

కార‌ణం ప్రియాంక అరుళ్ మోహ‌న్ తీసుకున్న నిర్ణ‌య‌మే అని తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళితే., రెమ్యూన‌రేష‌న్ కార‌ణంగా ప్రియాంక అరుళ్ మోహ‌న్ కి తెలుగునాట అవ‌కాశాలు రావ‌డం లేద‌ని కాస్టింగ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తెలుగులో చేసిన `నానీస్ గ్యాంగ్ లీడ‌ర్‌`, శ్రీ‌కారం వంటి హిట్లు ఉన్న‌ప్పటికీ ఈ బ్యూటీకి పెద్ద హీరోల స‌ర‌స‌న ఆఫ‌ర్లు రావ‌డం లేదు. కార‌ణం ఆమె డిమాండ్ చేస్తున్న పారితోషిక‌మే అని తెలుస్తోంది.

కెరీర్ తొలి నాళ్ల‌లోనే ప్రియాంక ఏకంగా ఒక్కో సినిమాకు 75 ల‌క్ష‌లు డిమాండ్ చేస్తోంద‌ట‌. దీంతో ఆమెకు ఆఫ‌ర్లు ఇవ్వ‌డానికి ఏ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ప్రియాంక ప్ర‌స్తుతం త‌మిళంలో సూర్య హీరోగా న‌టిస్తున్న `ఎంతార్కుమ్‌తున్న‌ధావ‌న్‌` చిత్రంలో న‌టిస్తోంది. పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై క‌ళానిథి మార‌న్ నిర్మిస్తున్నారు.

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీని తెలుగు, త‌మిళ భాష‌ల్లో మార్చి 10న విడుద‌ల చేస్తున్నారు. ఈ మూవీపై ప్రియాంక అరుళ్ మోహ‌న్ భారీ అంచ‌నాలు పెట్టుకుంది. ఇది గన‌క బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయితే ఆమె డిమాండ్ చేసినంత ఇవ్వ‌డానికి నిర్మాత‌లు ఆస‌క్తిని చూపిస్తారా? లేదా అన్న‌ది వేచి చూడాల్సిందే.