Begin typing your search above and press return to search.
'రాక్షసుడు' మూవీని హిందీలో రీమేక్ చేయనున్న తెలుగు నిర్మాత..
By: Tupaki Desk | 6 April 2020 11:30 PM GMTగతేడాది బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ 'రాక్షసుడు'. ఈ సినిమాను తమిళ రాచ్చసన్ నుండి తెలుగులోకి అనువదించారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. ఎంతో కాలం నుండి మంచి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ రాక్షసుడు సినిమా మంచి గుర్తింపునే తీసుకొచ్చింది. ఈ మధ్య సినిమాలు ఏ భాషలో హిట్ అయినా ఇతర భాషల్లోకి రీమేక్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అలాగే తన నిర్మాణంలో హిట్ అయిన రాక్షసుడు సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట నిర్మాత కోనేరు సత్యనారాయణ. ఈ సినిమా మంచి హిట్ అవ్వడమే కాకుండా మంచి వసూళ్లను కూడా సాధించింది.
బాలీవుడ్ లో ఈ మధ్య తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. అర్జున్ రెడ్డి, క్షణం, తాజాగా అల వైకుంఠపురంలో ఇలా రీమేక్ అవుతున్నాయి. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే రాక్షసుడు సినిమా హిందీ లో కూడా తెలుగు నిర్మాత నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతవరకు బాలీవుడ్ నిర్మాతల కన్ను రాక్షసుడు సినిమా పై పడలేదా.. లేక తెలుగు నిర్మాతే హిందీలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారా.. అని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇప్పటికే నిర్మాత కోనేరు సత్యనారాయణ బాలీవుడ్ హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాడట. ఈ సినిమాలో హీరోగా యంగ్ టాలెంటెడ్ ఆయుష్మాన్ ఖురానా లేదా విక్కీ కౌశల్ ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారట. ఈ లాక్ డౌన్ ముగిస్తే అధికారిక విషయాలు వెల్లడిస్తానని నిర్మాత చెప్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో కూడా మన వెర్షన్ నే రూపొందించాలని నిర్మాత భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.