Begin typing your search above and press return to search.
ఇక్కడ 2.0 కు నిర్మాత లేడా?
By: Tupaki Desk | 3 Oct 2018 7:22 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సినిమా '2.0'. నవంబర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా పై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. రీసెంట్ గా వినాయక చవితి సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. '2.0' మేకర్స్ నవంబర్ లో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు ఆ ఈవెంట్లో ట్రైలర్ ను రిలీజ్ చేస్తారట.
ఈ ఇన్ఫర్మేషన్ అంతా బాగానే ఉందిగానీ ఈ సినిమాను తెలుగులో ఎవరు రిలీజ్ చేస్తున్నారన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. '2.0' తెలుగు థియేట్రికల్ రైట్స్ ను రూ. 90 కోట్లకు ఎషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ తీసుకున్నారు. కాకపొతే సినిమా రిలీజ్ విపరీతంగా డిలే అవుతుండడంతో '2.0' నిర్మాతలను అడ్వాన్సు వెనక్కి అడిగాడట. లైకా వారికి ఇచ్చిన అడ్వాన్సు లో సగభాగం ఇప్పటికే తిరిగి సునీల్ కు ఇచ్చారని సమాచారం. మిగతా సగం మాత్రం పెండింగ్ ఉందట. ఇప్పుడు లైకా వారు తెలుగు రైట్స్ వేరే తెలుగు ప్రొడ్యూసర్ కు అమ్ముతారా లేదంటే ఏషియన్ ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ చేస్తారా అనేది వేచి చూడాలి.
హిందీ వెర్షన్ ను కరణ్ జోహార్ బ్యానర్ అయిన ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఇక మలయాళంలో కూడా అక్కడి లోకల్ ప్రొడ్యూసర్ దొరికాడట. మరి తెలుగులో నిర్మాత సంగతి మాత్రం ఇంకా తేలలేదు. చిట్టి రోబో.. క్రోమ్యాన్ లకు డిమాండ్ ఉన్నా 90 .. 100 కోట్లు అనేసరికి జడుసుకుని తెలుగు నిర్మాతలు లైకా వాళ్ళకు ఒక లైట్ ఇయర్ దూరం పారిపోతున్నారా ఏంటి?