Begin typing your search above and press return to search.
తెలుగోళ్లకి బెంగుళూరు డేస్ లనట్టే
By: Tupaki Desk | 13 Aug 2015 11:20 PM GMTగతేడాది రికార్డ్ కలెక్షన్లు తెచ్చుకున్న మళయాళ మూవీ బెంగళూర్ డేస్. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాకి భాషాబేధాలు లేకుండా మల్టీప్లెక్సుల్లో ఇరగదీసింది. హైద్రాబాద్ లో కూడా 4-5వారాలు హల్ చల్ చేసిన రికార్డ్ ఉంది. ఈ మూవీ తెలుగు, తమిళ్, హిందీ రీమేక్ రైట్స్ ని పీవీపీ సంస్థ కొనుగోలు చేసింది. తమిళ్ వెర్షన్ ని పీవీపీ సొంతగా తీస్తుండగా... తెలుగులో దిల్ రాజుతో కలిసి నిర్మించాలని భావించారు.
తెలుగు రీమేక్ లో నటిస్తారంటూ... దిల్ రాజుకు క్లోజ్ గా ఉండే హీరోలు కొందరి పేర్లు కూడా చెప్పారు. వరుణ్ తేజ్, శర్వానంద్, అవసరాల శ్రీనివాస్ లతో.. షూటింగ్ స్టార్ట్ చేద్దామని భావించారు. తమిళ్ ఆర్య, రాణా, బాబీ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరపాలని భావించినా... ఇప్పుడు తమిళ వెర్షన్ దాదాపు పూర్తి కావచ్చింది. తెలుగులో మాత్రం ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టలేదు.
తాను అనుకున్న హీరోలు నటించబోమని చెప్పడంతో దిల్ రాజు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ రాణా మన తెలుగోడే, ఆర్య కూడా తెలుగోళ్లకు బాగా పరిచయం ఉన్నోడే. తమిళ వెర్షన్ ని డైరెక్ట్ చేస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ కి... తెలుగులో వరుస ఫ్లాపులు ఇచ్చినా... ఇప్పటికీ మంచి పేరే ఉంది. అందుకే డబ్బింగ్ వెర్షన్ తో సరిపెట్టేయాలని డిసైడ్ అయ్యారట. మంచి ఫీల్ బేస్డ్ మూవీ బెంగళూరు డేస్. దీన్ని మనం తమిళ వాసనలతో చూడక తప్పేట్టు లేదు.