Begin typing your search above and press return to search.
చావడానికి టైమ్ లేదు!
By: Tupaki Desk | 7 Oct 2019 7:56 AM GMTజేమ్స్ బాండ్ 007 సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనేలేదు. 1962 నుంచి 007 సిరీస్ సినిమాలు అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాయి. డ్రామా.. స్పై థ్రిల్లర్.. భారీ ఛేజ్ లు.. యాక్షన్ ఎలిమెంట్స్ తో ఊహించనంత కొత్తగా అబ్బురపరిచే ట్రీట్ ని ఇవ్వడం ఈ సిరీస్ ప్రత్యేకత. అందుకే ఈ ఫ్రాంఛైజీ నుంచి ఓ కొత్త సినిమా వస్తోంది అంటే.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తుంటారు.
ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీ 25వ సినిమా సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో డేనియల్ క్రెయిగ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. 51 ఏజ్ లోనూ క్రెయిగ్ రెట్టించిన ఉత్సాహంతో నటిస్తున్నారట. డేనియల్ నటించిన గత నాలుగు చిత్రాలు ఘనవిజయం సాధించడంతో మరోసారి అతడినే రిపీట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ బాండ్ 007 సిరీస్ లో 14 సినిమాలు రిలీజైతే అందులో కేసినో రాయల్- క్వాంటమ్ ఆఫ్ సోలేస్- స్కై ఫాల్- స్పెక్టర్ ..ఈ నాలుగు చిత్రాల్లో క్రెయిగ్ నటించాడు. ఇవన్నీ ఇప్పటికే రిలీజై సంచలన విజయం సాధించాయి. తాజాగా ఐదో చిత్రం టైటిల్ రివీలైంది. `నో టైమ్ టు డై` అనేది టైటిల్. `చావడానికి టైమ్ లేదు` అంటూ ఫ్యాన్స్ కి స్ట్రైకింగ్ గా కనెక్టయ్యాడు బాండ్. ``ఐసీవైఎంఐ .. సెలబ్రేట్ .. జేమ్స్ బాండ్ డే!`` అంటూ నిర్మాణ సంస్థ ఈ పోస్టర్ ని రిలీజ్ చేసింది.
`నో టైమ్ టు డై-007` చిత్రానికి కెర్రీ జోజి ఫకునగ దర్శకత్వం వహిస్తున్నారు. హెచ్ బీవో పాపులర్ సిరీస్ `ట్రూ డిటెక్టివ్`తో వరల్డ్ వైడ్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్న గ్రేట్ డైరెక్టర్ కెర్రీ దీనికి దర్శకత్వం వహిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బార్బరా బ్రకోలి- మైఖేల్.జి.విల్సన్ బాండ్ 25 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2020 ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.