Begin typing your search above and press return to search.
ఎక్స్ క్లూసివ్..హీరో టైటిల్ కార్డు లేదట
By: Tupaki Desk | 1 Aug 2019 10:58 AM GMTకమర్షియల్ హీరో గా ఓ మార్కు తెచ్చుకోవడానికి ట్రై చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు రూట్ మార్చాడు. వరసగా కంటెంట్ ఉన్న కథల్నే ఎన్నుకోవాలని ఫిక్స్ అయ్యాడట.. ఈ నేపథ్యంలోనే సీత అంటూ ఓ సినిమా ట్రై చేసాడు కానీ ఆ సినిమాను జనాలు రిజెక్ట్ చేశారు.. అయితే మరో ప్రయత్నం గా తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన రాట్ససన్ ని తెలుగు లో రాక్షసుడు గా రీమేక్ చేసాడు బెల్లంకొండ శ్రీనివాస్... ఈ క్రైమ్ థ్రిల్లర్ తో ఐనా ఓ సక్సెస్ చూడాలని శ్రీనివాస్ తాపత్రయ పడుతున్నాడు... అంతే కాదు ఈ సినిమా పై అదే రేంజ్ లో కాన్ఫిడెంట్ గా ఉన్నాడని అర్ధం అవుతుంది ఎందుకంటే.. ఈ సినిమా కోసం హార్ట్ పెట్టి పనిచేసాను అని రెండు మూడు ఇంటర్వ్యూలో కూడా ఈ యాక్షన్ హీరో చెప్పాడు.. మనోడు కమర్షియల్ దారిని ఏ రేంజ్ లో వదిలేసాడు అంటే.. రాక్షసుడు సినిమా లో బెల్లంకొండ శ్రీనివాస్ అని తన టైటిల్ కార్డు కూడా వేసుకోవడం లేదట.. ఈ మార్పు మనోడికి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై రాక్షసుడు రూపొందింది, ఈ సినిమా లో బెల్లంకొండ సరసన మలయాళీ బ్యూటీ అనుపుమ పరమేశ్వరన్ నటించింది.