Begin typing your search above and press return to search.

జక్కన్నతో ఒకే కానీ.. కొరటాలతో అంటేనే కష్టం!

By:  Tupaki Desk   |   12 Oct 2022 9:30 AM GMT
జక్కన్నతో ఒకే కానీ.. కొరటాలతో అంటేనే కష్టం!
X
జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత వెంటనే మరొక సినిమాను మొదలుపెట్టాలని అనుకున్నాడు. అసలైతే ప్లాన్ ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలు చేయాలని అనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయిందో ఎవరికీ అర్థం కాలేదు.

త్రివిక్రమ్ తో ఎంతో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసి మరి జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో కొత్త ప్రాజెక్టు ఎనౌన్స్ చేశాడు. కేవలం ఫ్యాన్ ఇండియా అనే దారిలో వెళ్లేందుకే త్రివిక్రమ్ ను పక్కన పెట్టిన ఎన్టీఆర్ తప్పకుండా కొరటాల శివతో గ్రాండ్ మూవీ ని తెరపైకి తీసుకురావాలని అనుకున్నాడు.

కానీ RRR తర్వాత పరిస్థితులు మొత్తం ఒక్కసారిగా తారుమారయ్యాయి. రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ తో రామ్ చరణ్ కొరటాల శివతో ఊహించిన విధంగా ఆచార్యతో డిజాస్టర్ అందుకున్నాడు. ఇక అదే సెంటిమెంట్ తనకు కూడా అందుతుందేమో అని జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ వెయిటింగ్ లిస్టులో పెట్టాడు. మొత్తానికి కథ అయితే ఓకే అయింది కానీ ఇంకా షూటింగ్ మాత్రం మొదలు కావడం లేదు.

అసలు ఆ విషయంలో సరైన క్లారిటీ కూడా ఎవరు ఇవ్వడం లేదు. షూటింగ్ మొదలవడానికి ఇంకా మరో మూడు నెలల సమయం కూడా పడుతుందట. అయితే ఇదివరకే ఎన్టీఆర్ రాజమౌళి కారణంగా మూడేళ్లపాటు ఒకే సినిమా చేయాల్సి వచ్చింది.

ఇక ఇప్పుడు కొరటాల శివ కారణంగా వచ్చే ఏడాది కూడా ఎన్టీఆర్ నుంచి సినిమా రాకపోవచ్చు అప్పుడే 3 ఎళ్ళు వృధా అయ్యింది. ఇక ఇప్పుడు మరొక ఏడాది వెయిట్ చేయడం అంటే ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశ అని చెప్పవచ్చు.

రాజమౌళి కోసం ఎంత కాలం ఎదురుచూసిన కూడా మంచి స్టఫ్ అయితే దొరికింది కానీ కొరటాల శివ ఆ రేంజ్ లో సంతృప్తి పరుస్తాడా లేదా అనేది మరొక పెద్ద సందేహం. ముఖ్యంగా ఆచార్య దెబ్బ తర్వాత అసలు ఎన్టీఆర్ కొరటాల శివతో ప్రాజెక్ట్ ను తొందరగా మొదలుపెట్టలేదు అంటే స్క్రిప్ట్ పై అతను ఇంకా ఏ స్థాయిలో చర్చలు జరుపుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. మరి ఎన్టీఆర్ 2024లో అయినా తొందరగా ప్రేక్షకుల ముందుకు వస్తారో లేదో చూడాలి.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.