Begin typing your search above and press return to search.

'వాల్మీకి' సినిమాతో వాళ్లకి ఏమి ఒరిగింది..!

By:  Tupaki Desk   |   5 April 2020 3:12 PM GMT
వాల్మీకి సినిమాతో వాళ్లకి ఏమి ఒరిగింది..!
X
ఒక సినిమా రిజల్ట్ మీద ఎన్నో జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు.. ఆ సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్.. ఆ సినిమా ప్రొడ్యూసర్.. ఆ సినిమాకి పని చేసిన సాంకేతిక నిపుణులు - నటీనటులు.. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ ఆధారపడి ఉంటాయి. ఆ సినిమా హిట్ అయితే వాళ్ళ కెరీర్ కి ప్లస్ అవుతుంది. ప్లాప్ అయితే మైనస్ అవుతుంది. కొన్ని సినిమాలు హిట్టయినా వాటిలో నటించిన నటీనటులకు గుర్తింపు రాదు. కొన్ని సినిమాలు ప్లాప్ అయినా నటీనటులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవసి వచ్చిందంటే మన టాలీవుడ్ లో ఒక క్రేజీ ప్రాజెక్టులో హీరోకి తప్ప దాంట్లో నటించిన ఇంకెవరికి గుర్తింపు రాలేదు. దీనికి హీరోయిన్ కూడా మినహాయింపు కాదు.

ఆ సినిమా ఏంటబ్బా ఆలోచిస్తున్నారా..!, ఆ సినిమా ఏదో కాదు..మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'వాల్మీకి'. అదేనండీ.. మన 'గద్దలకొండ గణేష్'.. మృణాళిని రవి - పుజాహెగ్డే - అధర్వ మురళి ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా 14రీల్స్ రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట నిర్మించారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ సినిమా 'జిగర్తాండ'కి రీమేక్. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడమంటే అంత సులభమైన పనికాదు. కథలో అసలు విషయం దారి తప్పకుండా మన ప్రేక్షకులకు నచ్చేలా తీయాలి. అవసరమైతే మన ప్రాంతీయతకు తగ్గట్టు మార్పులు చేర్పులు చేయాలి. కానీ రీమేక్ ల స్పెషలిస్ట్ హరీష్ శంకర్ ఇవన్నీ చేయగలిగాడు. అయితే ఈ సినిమా హీరో వరుణ్ తేజ్ కి - స్పెషల్ రోల్ చేసిన పూజాహెడ్గేకి మాత్రమే ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఎన్నో ఆశలతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన హీరోయిన్ మృణాళినికి మాత్రం నిరాశే ఎదురైంది. ఈ సినిమాలో బాగానే యాక్టింగ్ చేసినప్పటికీ తర్వాత ఈ అమ్మడికి ఒక్క తెలుగు సినిమా ఆఫర్ కూడా రాలేదు. తమిళ కన్నడ చిత్రాల్లో ఛాన్స్ దక్కించుకున్న మృణాళిని టాలీవుడ్ లో మాత్రం పట్టించుకోలేదు. వాస్తవానికి హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించిన ప్రతీ హీరోయిన్ తర్వాత రోజుల్లో టాప్ పొజిషన్ కి వెళ్లిన వారే. ఒక్క గడ్డలకొండ గణేష్ హీరోయిన్ మాత్రమే ఒక్క సినిమాకే పరిమితమైంది. ఫేట్ బాగలేకపోతే ఎవరు మాత్రం ఏమి చేయగలరు చెప్పండి..!