Begin typing your search above and press return to search.
పవన్ వచ్చాడు.. కానీ ప్రయోజనం?
By: Tupaki Desk | 11 May 2018 5:30 PM GMTచేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లే ఉంది ‘నా పేరు సూర్య’ వ్యవహారం. మామూలుగా అల్లు అర్జున్ సినిమాలంటే ప్రి రిలీజ్ ప్రమోషన్లు హోరెత్తిపోతుంటాయి. దాని వల్ల అతడి సినిమాలకు ఓపెనింగ్స్ కూడా భారీగా వస్తుంటాయి. కానీ ‘నా పేరు సూర్య’ విషయంలో మాత్రం విడుదలకు ముందు ప్రమోషన్లు అంతగా కనిపించలేదు. పైగా మీడియాతో మెగా ఫ్యామిలీ గొడవ వల్ల కూడా ఈ చిత్రానికి స్వతహాగా ప్రచారం తక్కువైంది. ఆ ప్రభావం ఓపెనింగ్స్ మీద పడింది. సినిమాకు డివైడ్ టాక్ రావడం కూడా చేటు చేసింది. రిలీజ్ తర్వాత ప్రమోషన్లు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ.. ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు. రెండు మూడు రోజులుగా బన్నీ టీవీ ఛానెళ్లు తిరుగుతూ.. కొందరు దర్శకులతో కలిసి చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ఇంకా రకరకాలుగా ప్రయత్నిస్తున్నాడు కానీ ఫలితం పెద్దగా కనిపించట్లేదు.
వీకెండ్ తర్వాత ‘నా పేరు సూర్య’ బాగా వీక్ అయిపోయింది. పైగా బుధవారం రిలీజైన ‘మహానటి’కి బ్రహ్మాండమైన టాక్ రావడంతో ప్రేక్షకులు అటు మళ్లిపోయారు. పైగా శుక్రవారం ‘మెహబూబా’ కూడా వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎంత ప్రమోట్ చేసినా ‘నా పేరు సూర్య’ను పైకి లేపడం కష్టంగానే ఉంది. గురువారం సాయంత్రం థ్యాంక్స్ మీట్ పేరుతో ఒక కార్యక్రమం చేశారు. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం వచ్చాడు. కానీ ఇప్పటికే బాగా లేటవడంతో పవన్ వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండేట్లు కనిపించడం లేదు. ‘నా పేరు సూర్య’ తీసేసి ‘మహానటి’కి స్క్రీన్లు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వసూళ్లు లేనపుడు ఎగ్జిబిటర్లు మాత్రం ఏం చేస్తారు? ఇదేదో వీకెండ్ అయ్యీ అవ్వగానే చేసి ఉంటే ప్రయోజనం ఉండేది. అసలు ప్రి రిలీజ్ ప్రమోషన్లలో ఉదాసీనత ఈ సినిమాకు చేటు చేసింది.