Begin typing your search above and press return to search.
గూగుల్ సెర్చ్ లో నంబర్ వన్ కథానాయిక?
By: Tupaki Desk | 16 Dec 2022 2:30 AM GMTస్టార్ డమ్ ఆధారంగా సెర్చ్ వేరు.. నిరంతరం వార్తల్లో నిలవడం ద్వారా సెర్చింగ్ వేరు. ఈ రెండో కేటగిరీలో గూగుల్ సెర్చ్ లో ఎవరైనా టాప్ పొజిషన్ కి చేరుకోవచ్చు. రకరకాల వివాదాలతో కూడా కొందరు సెలబ్రిటీలు గూగుల్ లో ట్రెండ్ అయిపోవడం నిరంతరం చూస్తున్నదే. అయితే వరుసగా నటించిన సినిమాలు రిలీజైనా లేదా ఏదో ఒక ప్రయోగం చేస్తూ లేదా వివాదాలతో అంట కాగినా మోస్ట్ సెర్చ్ డ్ గూగుల్ స్టార్ అన్న ఖ్యాతి దక్కుతుంది. వ్యక్తిగత అంశాలతో నిరంతరం వార్తల్లో నిలిచే స్టార్లకు గూగుల్ పట్టంగడుతోంది.
2022లో గూగుల్ శోధనలో టాప్ 10లో ఉన్న సౌత్ కథానాయికల వివరాలు పరిశీలిస్తే జాబితా వరుస ఇలా ఉంది. కాజల్ అగర్వాల్ - సమంత- రష్మిక - తమన్నా- నయనతార- అనుష్క- పూజాహెగ్డే - కీర్తిసురేష్ - సాయిపల్లవి-రకుల్ ప్రీత్ సింగ్ మొదటి పది స్థానాల్లో నిలిచారు.
ఈ ఏడాది గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన సౌత్ నటీమణుల్లో నంబర్ వన్ స్థానంలో చందమామ కాజల్ అగర్వాల్ నిలవడం వెనక కారణాలు రకరకాలు.. ఒకటి కాజల్ ఈ ఏడాది `ఆచార్య` సినిమా విషయంలో హాట్ టాపిక్ గా మారింది. కాజల్ ఈ మూవీ నుంచి వైదొలగడంపై మెగాభిమానుల్లో ఎక్కువ చర్చ సాగింది. తర్వాత ఇదే ఏడాది తాను ప్రేమించిన బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని పెళ్లాడి పండంటి బిడ్డకు జన్మనిచ్చి మమ్మీ అయ్యింది. వృత్తిగతంగా కంటే ఇలాంటి వ్యక్తిగత విషయాలతో గూగుల్ లో ట్రెండ్ అయ్యింది.
సమంత గురించి ఇటీవల గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేశారు. దానికి కారణం పుష్ప చిత్రంలోని ఊ అంటావా సాంగ్ ఒకవైపు కొత్త ఏడాది ఆరంభాన్ని ఒక ఊపు ఊపింది. ఫ్యామిలీమ్యాన్ సిరీస్ గొప్ప ఆదరణ పొందడం మరోవైపు.. అలాగే వరుసగా బాలీవుడ్ లో పలు చిత్రాలకు కమిటైందని ఇకపై బాలీవుడ్ కి వెళ్లిపోతుందని సాగిన ప్రచారం.. దీనికి తోడు వ్యక్తిగత జీవితంలో కల్లోలం చైతన్యతో బ్రేకప్ సహా అనారోగ్య కారణాలతో సమంత గూగుల్ లో టాప్ 2 మోస్ట్ సెర్చ్ డ్ సెలబ్రిటీగా నిలిచింది.
యంగ్ అండ్ ఎనర్జిటిక్ గాళ్ రష్మిక మందన పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాతో క్రేజ్ ను పెంచుకుంది. అలాగే బాలీవుడ్ లో వరుసగా నాలుగు సినిమాలకు సంతకాలు చేసి ఉత్తరాది మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ భామ అమితాబ్ -మల్హోత్రా లాంటి స్టార్లతో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. ఈ భామ సినిమాలు చేస్తూనే వీలున్నప్పుడల్లా అభిమానులతో రెగ్యులర్ సోషల్ మీడియా ఇంటరాక్షన్ తో అందరినీ ఆకట్టుకుని 3వ స్థానాన్ని సంపాదించుకుంది.
తమన్నా.. ఈ ఏడాది వరుస చిత్రాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాల్లో మునుపటి కంటే స్పీడ్ గా ఉంది. రకరకాల కారణాలతో తమన్నా సౌత్ నుంచి 4వ స్థానాన్ని అందుకుంది. తలైవిగా పాపులరైన నయనతార నిరంతరం విఘ్నేష్ శివన్ తో షికార్ల రూపంలో ఎక్కువగా ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారింది. పెళ్లి అనంతరం సరోగసీ వివాదం కూడా నయన్ ని నిరంతరం వార్తల్లో ఉండేలా చేసింది. ఓ వైపు మంచి మరోవైపు చెడు అంశాలతో హెడ్ లైన్స్ లో నిలిచింది. తన స్థానం ఐదు.
అనుష్క శెట్టి క్రేజ్ ఇప్పటికీ అభిమానుల్లో తగ్గలేదనడానికి ఇదే (గూగుల్ సెర్చ్ ) ఒక నిదర్శనం. కొత్తగా అనుష్క నటించిన మూవీ ఏదీ విడుదల కాకపోయినా తనను అభిమానులు ఇంకా గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తూనే ఉన్నారు. అనుష్క పెళ్లికి రెడీ అవుతోందని అందుకే సినిమాలకు సంతకాలు చేయడం లేదన్న ప్రచారంతోను గూగుల్ సెర్చ్ లో నిలిచింది. అనుష్క శెట్టి జాబితాలో 6 వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
నిజానికి పూజాహెగ్డే ఇటీవలి కాలంలో వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది. దీనివల్ల తనకు పాపులారిటీ మరింత పెరగాల్సి ఉన్నా ఎందుకనో ఏడో స్థానానికి పరిమితమైంది. బహుశా రాధేశ్యామ్ - బీస్ట్ లాంటి ఫ్లాప్ సినిమాల్లో నటించి కొంతవరకూ పూజా హైడ్ అయ్యిందని చెప్పాలి. పూజా హెగ్డే 7వ స్థానంలో నిలిచింది.
జాతీయ అవార్డు గెలుచుకున్న నటిగా కీర్తి సురేష్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. మహానటిగా ఇంకా ప్రజల గుండెల్లో నిలిచి ఉంది. 100 మంది ప్రముఖ ఆసియా తారల జాబితాలో 62వ స్థానంలో నిలిచిన ఈ బ్యూటీ.. గూగుల్ సెర్చ్ లో దక్షిణాది నటీమణులలో 8వ స్థానంలో ఉన్నారు.
సాయి పల్లవి ఇతర నాయికల కంటే హైపర్ యాక్టివ్. గొప్ప డ్యాన్సర్.. నటి .. ఆల్ రౌండర్. అందుకే తన పేరు నిరంతరం మార్మోగుతూనే ఉంటుంది. ఈ ఏడాది టాప్ 9 స్థానంలో నిలిచింది. సాయి పల్లవి ఎప్పటిలానే జాబితాలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
రకుల్ ప్రీత్ సింగ్ పెద్దగా విడుదలలు లేకుండానే గూగుల్ శోధనలో టాప్ 10 సౌత్ నటీమణులలో ఒకరిగా నిలిచింది. రకుల్ కి చాలా కాలంగా తెలుగులో అగ్రహీరోలు ఎవరూ అవకాశాలివ్వకపోవడం పెద్ద మైనస్ గా మారింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సరసన నటించిన కొండపొలం నిరాశపరచడంతో ఆ తర్వాత రకుల్ పూర్తిగా బాలీవుడ్ పై దృష్టి సారించింది. ఇక నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమాయణం సాగిస్తూ రకుల్ వార్తల్లో నిలిచింది. కానీ ప్రతిసారీ టాప్ 5లో నిలిచి ఉండే ఈ పేరు ఈసారి పదో స్థానానికి పడిపోవడం కొంత నిరాశే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.