Begin typing your search above and press return to search.
బండ్లన్నను పట్టించుకునేవారే లేరా?
By: Tupaki Desk | 21 May 2022 11:30 AM GMTఈ మధ్య ఎంత పెద్ద స్టార్ కాస్టింగ్ వున్నా సరే దాన్ని ప్రాపర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లగలిగితేనే ఓహో ఈ సినిమా రిలీజ్ అవుతోందా? అని ప్రేక్షకులు అటెన్షన్ వహిస్తున్నారు. బాగుందని టాక్ వినిపిస్తేనే థియేటర్లలో వాలిపోతున్నారు. కానీ ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా సినిమా రిలీజ్ చేస్తే మాత్రం థియేటర్లలో ప్రేక్షకుల సందడి కాదు కదా ఆ వైపు ప్రేక్షకుల అడుగుల చప్పుడు కూడా వినిపించడం లేదు.
పెద్ద పెద్ద చిత్రాలకే రిలీజ్ కు ముందు భారీ స్థాయిలో కోట్లు కుమ్మరించి ప్రచా ఆర్భాటాలు చేయాల్సి వస్తోంది. అంత చేసినా కంటెంట్ సరిగా లేకపోతే స్టార్ సినిమాని కూడా ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఇటీవల కొన్ని చిత్రాలకు ఇది జరిగింది కూడా.
ఇక పాన్ ఇండియా సినిమాలకైతే ప్రచారం కోసం కోట్లు ఖర్చు చుస్తున్నారు. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కోసం ఏకంగా మేకర్స్ 20 కోట్లు ఖర్చు చేయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
భారీ క్రేజీ చిత్రాలకే ఈ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తుంటే చిన్న సినిమాని మాత్రం సైలెంట్ గా రిలీజ్ చేసి చేతుల దులుపుకున్నారు మేకర్స్. స్టార్ ప్రొడ్యూసర్, నటుడు బండ్ల గణేష్ కీలక పాత్రలో నటించిన చిత్రం `డేగల బాబ్జీ`. తమిళంలో పార్తీబన్ నటించగా జాతీ అవార్డుని తెచ్చి పెట్టిన `ఒత్తాత సెరుప్పు సైజ్ 7` చిత్రాన్ని తెలుగులో `డేగల బాబ్జి` పేరుతో రీమేక్ చేశారు.
రాజశేఖర్ నటించిన `శేఖర్` సినిమా విడుదలైన రోజే మే 20న ఈ చిత్రాన్ని కూడా విడుదల చేశారు. సింగిల్ ఆర్టిస్ట్ తో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద నో బజ్. అసలు ఈ సినిమాని పట్టించుకున్న వారే లేరు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ స్క్రీన్ లలో ఈ మూవీని ఎలాంటి ప్రచారం లేకుండా విడుదల చేశారు. ఈ సినిమా రిలీజ్ అయినట్టుగా ఇంత వరకు ఎవరికీ తెలియదు.
ఆ స్థాయిలో ఈ సినిమాకు ప్రచారాన్ని నిర్వహించింది చిత్రబృందం. ఫైనల్ గా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీపై ఆసక్తిని చూపించడం లేదట. తెలిసిన వాళ్లు చూసినా సినిమా డిజాస్టర్ అని ఓపెన్ గా చెప్పేస్తున్నారట. దీంతో భారీగా ఎక్స్ పెక్ట్ చేసిన బండ్లన్నకు ఇలా జరిగిందేంటీ అని ఆయన సన్నిహితులు వాపోతున్నారట. అంతే కాకుండా ఆశలు పెట్టుకున్న ప్రాజెక్ట్ ఏంది బండ్లన్నా ఇలా బిస్కెట్ అయిందని కొంత మంది కామెంట్ చేస్తున్నారట.