Begin typing your search above and press return to search.
బిబి4 : కెప్టెన్ అయిన నోయల్.. అవినాష్ మాటతో కన్నీరు పెట్టుకున్న సోహెల్
By: Tupaki Desk | 15 Oct 2020 5:45 AM GMTబిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ అమీ తుమీలో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో గడ్డం, తల హాఫ్ సేవ్ చేసుకోవాలంటూ బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ ను ఎవరు స్వీకరించలేదు. ఆ తర్వాత పేడ నీటిలో ఉన్న 100 బటన్స్ ను వెదికే డీల్ కు అఖిల్ టీం గంట కొట్టారు. దివి చాలా కష్టపడి 93 బటన్స్ ను సేకరించింది. మరో వైపు అవినాష్ మొహానికి మాస్క్ వేసుకుని అరటి పండు తినే ఛాలెంజ్ ను అరియానా టీం తీసుకుంది. చివరకు ఒక ఇంటి సభ్యుడు కుర్చీలో కూర్చుని ఉండగా ఇతర సభ్యులు లేపేందుకు ప్రయత్నించాలి. ఆ ఢీల్ ను అఖిల్ టీం గంట కొట్టి దక్కించుకుంది. అఖిల్ స్వయంగా ఆ టాస్క్ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
అఖిల్ కుర్చీలో కూర్చున్న సమయంలో అవినాష్.. అభిజిత్.. అరియానా ఇతర టీం సభ్యులు అతడికి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి లేపేందుకు ప్రయత్నించాడు. కాని అతడు మాత్రం లేవకుండా చాలా ఓపికతో అలాగే ఉన్నాడు. ఈ ఛాలెంజ్ సమయంలో అవినాష్ మరియు సోహెల్ ల మద్య చర్చ జరిగింది. దివి టబ్ నుండి బయటకు దిగింది. అప్పుడు ఆమెను డిస్ క్వాలిఫై చేయకుండా సోహెల్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అంటూ అవినాష్ అసహనం వ్యక్తం చేశాడు. నా దృష్టిలో సోహెల్ సంచాలక్ విధులను సరిగా నిర్వర్తించడం లేదంటూ అవినాష్ అనడంతో మాటలకు మాట పెరిగింది.
గత వీకెండ్ నుండి సోహెల్ తన మాటలను తగ్గించాడు. అవినాష్ తో గొడవ పడుతున్న సమయంలో కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు. బాత్ రూంలోకి వెళ్లి చాలా బలంగ ఆ కుర్చిని గుద్దాడు. ఆ తర్వాత అన్నం తినే సమయంలో కూడా సోహెల్ కన్నీరు పెట్టుకున్నాడు. అవినాష్ మాటలతో హర్ట్ అయిన సోహెల్ తాను ఎంత ఓపికతో ఉండాలనుకున్నా కూడా వీలు పడటం లేదు అంటూ సోహెల్ కన్నీరు పెట్టుకోవడంతో అంతా కూడా ఒక్క చోటుకు చేరి అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు.
అమితుమీ టాస్క్ లో అఖిల్ టీం గెలవడంతో ఆ టీంకు చెందిన వారు మొత్తం కెప్టెన్సీ టాస్క్ చేశాడు. అవినాష్ ఆ సమయంలో సంచాలక్ గా వ్యవహరించాడు. తలకు పెట్టిన హెల్మెట్ కు కట్టిన బ్యాట్ తో తమకు కేటాయించిన కలర్ బంతులను గోల్ చేయాల్సి ఉంటుంది. నోయల్ ఎక్కువగా బంతులను వేశాడు. దాంతో నోయల్ కెప్టెన్ అయినట్లుగా అవినాష్ ప్రకటించాడు. అయితే కెప్టెన్ అయిన నోయల్ కు వచ్చే వారం ఇమ్యూనిటీ లేదు. ఎందుకంటే అమితుమీ ఛాలెంజ్ లో భాగంగా నేరుగా నామినేట్ అయ్యేందుకు నోయల్ సిద్దం అయ్యాడు.