Begin typing your search above and press return to search.
డ్రగ్సు ఆ అందాల భామ కొంపముంచాయి
By: Tupaki Desk | 28 March 2017 10:22 AM GMTబాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా, ముగ్థమనోహరిగా ప్రశంసలు అందుకున్న మమతా కులకర్ణి దారితప్పి కోరి ఇబ్బందులు కొనితెచ్చుకుంటోంది. ఇప్పటికే ఇరుక్కున్న 2 వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్ రాకెట్ కేసులో పీకల్లోతు కష్టాల్లో పడింది. థానెలోని ప్రత్యేక కోర్టు మమతా కులకర్ణితో పాటు, ఆమె భర్త.. అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ వికీ గోస్వామికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
2014లో ఈ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత మమత, గోస్వామి అజ్ఞాతంలోకి వెళ్లారు. గుజరాత్ కు చెందిన గోస్వామిది నిజానికి అస్సాం అని చెబుతుంటారు. నేపాల్ - దుబాయి కేంద్రంగా డ్రగ్స్ వ్యాపారం చేసిన గోస్వామిది నేర చరిత్రే. గ్యాంగ్ స్టర్ కూడా. అలాంటి గోస్వామిని పెళ్లాడిన మమత కూడా డ్రగ్స్ కు బానిసైంది.
కాగా ఈ కేసులో ప్రధాన నిందితులు వీరేనని, వీరిపై వారెంట్ జారీ చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు ముందు వాదించడం.. ఈ కేసులో పట్టుబడిన నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించిన విషయాలను కోర్టుకు చెప్పడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇష్యూ చేసింది. 2014 ఏప్రిల్ లో థానె క్రైమ్ బ్రాంచ్ అధికారులు దాడులు చేసి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో గోస్వామికి - కెన్యాకు చెందిన అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకు ప్రమేయమున్నట్టు కనుగొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/