Begin typing your search above and press return to search.

వరుస ప్లాప్స్ వచ్చినా.. నాన్-థియేట్రికల్ రైట్స్ రూ.125 కోట్లు

By:  Tupaki Desk   |   5 May 2022 8:30 AM GMT
వరుస ప్లాప్స్ వచ్చినా.. నాన్-థియేట్రికల్ రైట్స్ రూ.125 కోట్లు
X
యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ కు సాలిడ్ సక్సెస్‌ లను దక్కించుకుని సంవత్సరాలు గడుస్తుంది. అయినా కూడా ఆయన అంటే దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో అభిమానం ఉంది. ఆయన సినిమాలు కమర్షియల్‌ గా హిట్ కాకున్నా విభిన్నంగా ఉంటాయనే టాక్‌ ను దక్కించుకున్నాయి. హీరోగా ఆయన రెగ్యులర్‌ ఫార్మట్ లో కాకుండా విభిన్నమైన సినిమాలను చేస్తూ వెళ్తున్నాడు. తాజాగా ఆయన చేసిన చిత్రం 'విక్రమ్‌'.

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ హీరోగా రూపొందిన విక్రమ్‌ సినిమా లో తమిళ స్టార్‌ నటుడు విజయ్ సేతుపతి మరియు మలయాళ స్టార్‌ నటుడు ఫాహద్ ఫాజిల్‌ లు నటించారు.

వీరిద్దరు నటించడం వల్ల సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ ముగ్గురి కలయిక కోసం ప్రతి ఒక్క ఇండియన్‌ సినీ అభిమాని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాకు ఉన్న బజ్‌ నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ఎత్తున జరుగుతోంది. ఈ సినిమాకు కమల్‌ హాసన్‌ నిర్మాతగా వ్యవహరించాడు. ఆయనకు ఈ సినిమా కాసుల పంట పండిస్తుంది. సినిమా నిర్మాణ వ్యయం వంద కోట్ల లోపు అయ్యి ఉంటుంది. కాని ఇప్పటికే నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ ద్వారా ఏకంగా 125 కోట్ల రూపాయలను కమల్‌ దక్కించుకున్నాడు. తాజాగా ఓటీటీ మరియు శాటిలైట్‌ రైట్స్ ను స్టార్‌ సంస్థ దక్కించుకుంది.

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ ఓటీటీ మరియు స్టార్‌ అన్ని ఛానల్స్ లో ఈ సినిమా తమిళం.. తెలుగు.. హిందీ.. కన్నడం మరియు మలయాళం వర్షన్ లలో టెలికాస్ట్‌ అవ్వబోతుంది. ఈమద్య కాలంలో తమిళంలో జరిగిన అతి పెద్ద నాన్ థియేట్రికల్‌ బిజినెస్ గా దీన్ని చెప్పుకుంటున్నారు. వరుస ప్లాప్‌ లతో ఉన్న హీరో సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ జరగడం తో అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

కమల్‌ హాసన్‌ ఈ సినిమాతో ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్‌ కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా 150 కోట్ల వరకు థియేట్రికల్‌ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది. అదే కనుక నిజం అయితే కమల్‌ లాభాల లెక్కలు చాలా పెద్దగా ఉండే అవకాశం ఉంది.