Begin typing your search above and press return to search.
మహర్షికు లెక్కల చిక్కులు ?
By: Tupaki Desk | 28 March 2019 5:14 AM GMTఇంకా నలభై రోజులకు పైగా సమయం ఉన్నప్పటికీ మహేష్ బాబు మహర్షి కోసం అభిమానుల కౌంట్ డౌన్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఈసారి రికార్డుల మోత ఖాయమని శ్రీమంతుడుని మించిన బ్లాక్ బస్టర్ కొడతామని చాలా ధీమాగా ఉన్నారు. వాస్తవానికి బిజినెస్ పరంగా స్టార్ హీరో సినిమాలు ఎప్పుడు రిస్క్ లో ఉండవు. ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టినా థియేట్రికల్ రైట్స్ రూపంలోనే సగం పెట్టుబడి వెనక్కు వస్తుంది.
అయితే విచిత్రంగా మహర్షి లెక్కలు మాత్రం దానికి భిన్నంగా వినిపిస్తున్నాయి. సోషల్ మెసేజ్ మిక్స్ చేసిన కమర్షియల్ మూవీ అయినప్పటికీ దీని బడ్జెట్ సుమారుగా 130 కోట్ల దాకా ఖర్చయ్యిందని ఇన్ సైడ్ టాక్. వీటిలో హీరో హీరొయిన్ల పారితోషికాలు కలిపే ఉన్నాయి. ముగ్గురు అగ్ర నిర్మాతలు కలిస్తేనే ఇక్కడికి ఉంది ఒకవేళ ఏ ఒక్కరో ఇది తీయాల్సి వచ్చి ఉంటే ఎంత పెద్ద రిస్క్ అయ్యేదో కదా అని చర్చించుకుంటున్నారు
నిజానికి మహర్షి లాంటి సబ్జెక్టుకు ఇది చాలా భారీ మొత్తం. శాటిలైట్ డిజిటల్ వగైరాల నుంచి 40 కోట్ల దాకా వచ్చినా మిగలిన వంద కోట్లను కేవలం థియేట్రికల్ రన్ నుంచి రాబట్టుకోవడం అంత ఈజీ కాదు. నాన్ బాహుబలి రేంజ్ లో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడితే తప్ప అది సాధ్యం కాదు. సీడెడ్ కు మాములుగా మహేష్ మార్కెట్ ని నుంచి 5 కోట్ల దాకా అదనంగా అడుగుతున్నారట. భరత్ అనే నేను అతి కష్టం మీద అక్కడ 10 కోట్ల మార్క్ టచ్ అయ్యింది. ఇప్పుడు మహర్షి 15 అడిగితే వర్క్ అవుట్ అవుతుందా అనేది ట్రేడ్ మాట.
ఇక నైజాం ఎలాగూ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు తీసుకుంటారు ఓ 18 కోట్ల దాకా వర్క్ అవుట్ చేయొచ్చు. ఇక ఆంధ్రా ప్రాంతం డీల్స్ ఇప్పుడిప్పుడు ఒక కొలిక్కి వస్తున్నాయి. ఇవన్ని కలుపుకున్నా విడుదలకు ముందే 130 కోట్లను సమీకరించడం అంతే ఈజీ కాదు. విడుదల మూడో సారి వాయిదాకు ఈ లావాదేవీలు కూడా ఓ కారణమని గాసిప్ ఉంది. కొండంత లక్ష్యంగా కనిపిస్తున్న మహర్షి బిజినెస్ టార్గెట్ ని రీచ్ అవ్వాలి మహేష్ కెరీర్ బెస్ట్ అనిపించే రేంజ్ మహర్షి ఆడాల్సిందే. లేదంటే చిక్కులు తప్పేలా లేవు