Begin typing your search above and press return to search.

పూరి వీడియో : నూనుగు మీసాల పోరడు సూడు

By:  Tupaki Desk   |   3 Jun 2022 11:33 AM GMT
పూరి వీడియో : నూనుగు మీసాల పోరడు సూడు
X
ఆకాష్ పూరి హీరోగా గెహ్నా హీరోయిన్ గా రూపొందుతున్న 'చోర్‌ బజార్‌' సినిమా నుండి మరో పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్మూత్ అండ్ కూల్ గా ఉన్న నూనుగు మీసాల పోరడు సూడు అంటూ సాగుతున్న ఈ పాటకు మంచి విజువల్స్ తోడు అవ్వడంతో చూడ్డానికి మరియు వినడానికి కూడా బాగుంది. హీరోయిన్‌ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా లక్ష్మీ మేఘన పాట పాడి మెప్పించింది.

సినిమాలో ఆకాష్‌ పూరి మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు.. ఆసక్తి పెంచడంలో ఫస్ట్‌ లుక్‌ మరియు మొదటి పాట సఫలం అయ్యాయి.

తాజాగా విడుదల అయిన ఈ పాట కూడా చోర్‌ బజార్‌ గురించి చర్చ జరిగేలా చేసింది. ఒక అమ్మాయి తన ప్రియుడి గురించి తల్చుకుని పాడుకునే పాటగా దీన్ని దర్శకుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది.

లిరికల్‌ వీడియో అయినా కూడా హీరోయిన్ పాత్రను సాధ్యం అయినంత ఎక్కువ చూపించే ప్రయత్నం చేశారు. అల్లరి అల్లరిగా ఉండే హీరోయిన్‌ హీరో తో ప్రేమలో పడటం.. ఆమె బ్యాక్ గ్రౌండ్‌ సింపుల్‌ గా ఉంటుందని ఈ పాట ద్వారా చూపించారు. ఒక బస్తీలో ఈ సినిమాను చేశారని ఈ పాట లిరికల్‌ వీడియో చూస్తే అర్థం అవుతుంది.

నూనుగు మీసాల పోరడు సూడు అంటూ హీరోయిన్ క్యూట్‌ గా పాడే ఈ పాట సినిమాలో కూడా తప్పకుండా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పటి వరకు కమర్షియల్‌ సక్సెస్ లేని ఆకాష్ పూరి ఈ సినిమా తో అయినా సక్సెస్ ను దక్కించుకుంటాడా అనేది చూడాలి.

గత చిత్రం రొమాంటిక్ లో నటుడిగా తనను తాను నిరూపించుకున్న ఆకాష్ పూరి ఈ సినిమా తో మరో సారి తనలోని మాస్‌ యాంగిల్‌ ను చూపించేలా ఉన్నాడు. తప్పకుండా ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్‌ టు బ్యాక్‌ పాటలు అయితే వస్తున్నాయి కాని సినిమా ఎప్పుడు విడుదల అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.