Begin typing your search above and press return to search.

'ప్రియా వారియర్' తో వార్ ఎందుకో?

By:  Tupaki Desk   |   21 Feb 2019 11:56 AM GMT
ప్రియా వారియర్ తో వార్ ఎందుకో?
X
ప్రియా వారియర్...ఒకే ఒక్క సారి కన్ను గీటి రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయింది ఈ భామ. అయితే మలయాళంలో "ఒరు ఆడార్ లవ్"తో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెకు ఫిదా అయిపోయిన తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆ సినిమాని "లవర్స్ డే"కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అయితే సినిమా భారీ డిసాస్టర్ గా నిలవడమే కాకుండా - మరో పక్క ఈ సినిమా వల్ల ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్స్ మధ్య భారీ గొడవకు దారి తీసింది. ఇదిలా ఉంటే అసలు ఇంతకీ ఈ గొడవ ఏంటి? ఏం జరిగింది అని వివరాల్లోకి వెళితే...

ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ లో కనిపించిన నూరిన్ ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్ లో ఒకరు అని చెప్పవచ్చు. సినిమా పరంగా - పాత్రల పరంగా చూసుకుంటే ఈ సినిమాలో ప్రియా హీరోయిన్ అయినప్పటికీ - నూరిన్ పాత్ర మాత్రం మంచి మార్కులు వేసుకుంది అని చెప్పాలి. ముఖ్యంగా నటన పరంగా ప్రియ కన్నా నూరిన్ బాగా చేసింది అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో జరిగిన అన్యాయాన్ని నూరిన్ వివరిస్తూ...ఈ సినిమా విషయంలో నన్ను మోసం చేశారు అని - అసలు ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ నేనే అని - కానీ, ప్రియ రాత్రికి రాత్రే ఫేమస్ కావడంతో పాత్రలు పూర్తిగా మార్చేసారు అని, అంతేకాకుండా తన పాత్రను సపోర్టింగ్ పాత్రగా చేసేసారు అని - ఇది చాలా అన్యాయం అని - ఆమె చెబుతుంది.

అంతేకాకుండా ఇదంతా ప్రియా వారియర్ వల్లనే జరిగింది అని - అందుకే భవిష్యత్తులో ఆమెతో నటించను అని - సమస్యే లేదు అని - అయితే హీరో రోషన్ అబ్దుల్‌ తో ఛాన్స్ వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాను అని తెలిపింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ సినిమా వల్ల ఈ ఇద్దరు హీరోయిన్స్ మధ్య పెద్ద గొడవే వచ్చింది. ఏది ఏమైనా...క్రేజ్ అయితే ప్రియకి వచ్చింది కానీ - సినిమా పరంగా యాక్టింగ్ పరంగా మాత్రం నూరిన్ బాగా చేసింది అని విమర్శకులు సైతం ప్రసంచించడం గమనార్హం.