Begin typing your search above and press return to search.

వీడియో: మ‌నోహ‌రి ఒంపుసొంపుల వ‌డ్డ‌న‌లు

By:  Tupaki Desk   |   8 May 2021 4:10 PM GMT
వీడియో: మ‌నోహ‌రి ఒంపుసొంపుల వ‌డ్డ‌న‌లు
X
అందానికి అందం .. అద్భుత డ్యాన్సింగ్ ట్యాలెంట్.. అంత‌కుమించి క‌వ్వింత.. ఇవ‌న్నీ నోరా ఫ‌తేహి ప్ర‌త్యేక‌త‌లు. బాహుబ‌లి మ‌నోహ‌రిగా ఈ అమ్మ‌డు ప్ర‌పంచానికి సుప‌రిచితం. 29ఏళ్ల ఈ మొరాకో బ్యూటీ బాలీవుడ్ లో ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ సినిమాల్లో న‌టిస్తోంది. అలాగే సోష‌ల్ మీడియాల్లోనూ నోరా దుమారం రెగ్యుల‌ర్ గా చూసేదే. నిరంత‌రం త‌న టీవీ షోలు డ్యాన్సింగ్ షోల‌కు సంబంధించిన వీడియోల్ని అందిస్తూనే.. మ‌రోవైపు వ‌రుస‌గా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్ని షేర్ చేస్తూ ల‌క్ష‌ల్లో ఆర్జిస్తోంది.

నోరా ఫతేహి తాజాగా కొత్త వీడియోలో ప్ర‌ఖ్యాత బ్రాండ్ దుస్తుల‌ను ప్ర‌మోట్ చేస్తోంది. ఈ వీడియోలో సాధారణం దుస్తులు నుండి నైట్ డ్రెస్ ఎలాన్ వరకు ప్ర‌ద‌ర్శించిన తీరు ఆక‌ట్టుకుంది. నోరా ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోను పంచుకున్నారు. మోనోటోన్ బాడీకాన్ దుస్తులు .. మెరుపులు మెరిపించే కో-ఆర్డ్ దుస్తుల్లో నోరా లుక్ సూప‌ర్భ్. డిజైనర్ నయీమ్ ఖాన్ బోల్డ్ పవర్ సూట్... షిమ్మ‌రీ బ్లేజ‌ర్ల‌తోనూ నోరా విరుచుకుప‌డింది. 29 ఏళ్ల ఈ అందాన్ని హై-ఎండ్ డిజైనర్ క్రిస్టియన్ లౌబౌటిన్ అల్మారాల స్ట్రాపీ హీల్స్ తో స్టైలింగ్ చేశారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా -సత్యమేవ జయతే 2 చిత్రాల్లో కనిపించ‌నుంది. నిజానికి నోరా రేంజ్ కి త‌గ్గ ఆఫ‌ర్ ఇంత‌వ‌ర‌కూ ద‌క్క‌లేద‌నే చెప్పాలి. భారీ యాక్ష‌న్ డ్యాన్సుల‌తో హీట్ పెంచే పాత్ర‌ల్లో న‌టించేందుకు ఈ బ్యూటీ ఎప్పుడూ సిద్ధ‌మే. కానీ ఆ త‌ర‌హా ఆఫ‌ర్స్ త‌న‌ని వ‌రించాల్సి ఉంది.