Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మ‌నోహ‌రి దెబ్బ‌కు ఎయిర్ పోర్ట్ షేక్

By:  Tupaki Desk   |   11 March 2021 9:45 AM GMT
ఫోటో స్టోరి: మ‌నోహ‌రి దెబ్బ‌కు ఎయిర్ పోర్ట్ షేక్
X
మ‌లైకా త‌ర్వాత బాలీవుడ్ లో అంత‌కుమించి...! అని నిరూపిస్తోంది నోరా ఫ‌తేహి. వ‌రుస‌గా చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ తో దుమ్ము రేపుతోంది. ఇంత‌కుముందు బాహుబ‌లిలో మ‌నోహ‌రి గీతానికి అదిరిపోయే నృత్యాలు చేసింది. నోరా ఆ ఒక్క పాట‌తో డార్లింగ్ అభిమానుల గుండెల్లో గుడి క‌ట్టుకుంది. ఇటీవ‌ల‌ బాలీవుడ్ లో వ‌రుస ఐటెమ్ నంబ‌ర్ల‌తో అగ్గి రాజేస్తోంది.

ఓ సాఖి సాఖి.. చోర్ దేంగే.. దిల్ బ‌ర్.. నాచ్ మేరా రాణి.. గ‌ర్మీ.. ఇవ‌న్నీ చార్ట్ బ‌స్ట‌ర్ నంబ‌ర్లు. మొన్న‌నే నోరా ఓ రొమాంటిక్ నంబ‌ర్ తో నోరా యూట్యూబ్ ని షేక్ చేసింది. ఇక ఇదే హుషారులో ఈ భామ వ‌ర‌స రియాలిటీ షోల‌తో పాటు సినిమాల‌తోనూ బిజీ అయిపోతోంది. లేటెస్ట్ గా ఓ ఎయిర్ పోర్ట్ నుంచి వ‌స్తూ కెమెరా కంటికి చిక్కిందిలా.టాప్ టు బాట‌మ్ వైట్ అండ్ వైట్ లుక్ లో నోరా అగ్గి రాజేసింది. విమానాశ్ర‌యంలో యూత్ కి కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీట్ ఇచ్చింది నోరా. తెల్లటి క్రాప్ టాప్ లో అద‌ర‌గొట్టింది. అక్క‌డ‌ క‌ళ్ల‌న్నీ ఈ అమ్మ‌డిపైనే.

నోరా ఫతేహి `చిక్ క్రాప్ టాప్స్ ఫ్యాషన్`లో స్పెష‌లిస్ట్. ఇలా స్పెష‌ల్ ఫ్యాషన్ కోటీన్ ‌ధ‌రించి అన్ని కళ్ళు త‌న‌నే అతుక్కుపోయాయంటే అతిశ‌యోక్తి కాదు.పెన్సిల్ స్కర్ట్ తో ఎద అందాల్ని ఎలివేట్ చేసే బ్రాలెట్ లో క‌నిపించింది నోరా. ఆమె భుజాలపై మ్యాచింగ్ బ్లేజర్ ‌.. టాన్ టోన్డ్ డిజైనర్ హ్యాండ్ బ్యాగ్ .. లేతరంగు సన్ గ్లాస్ తో వ్వావ్ అనిపించింది. కాలికి ఆ కాంబినేష‌న్ హై హీల్స్ లుక్ ని మ‌రింత హైలైట్ చేశాయ‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ఈ ఫోటో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది.