Begin typing your search above and press return to search.

అలా ఓర‌గా చూసి వేడి పెంచిన మ‌నోహ‌రి

By:  Tupaki Desk   |   10 May 2021 2:30 PM GMT
అలా ఓర‌గా చూసి వేడి పెంచిన మ‌నోహ‌రి
X
బాహుబ‌లి మ‌నోహ‌రిగా నోరా ఫ‌తేహి కి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ మొరాకో బ్యూటీకి అభిమానులున్నారు. సినీన‌టిగా కెరీర్ ఆరంభ‌మే విదేశీ డ్యాన్స్ షోలు.. రియాలిటీ షోలు.. ఈ భామ‌కు ఎన‌లేని గుర్తింపును తెచ్చి పెట్టాయి. ఇక బాలీవుడ్ లో అడుగుపెట్టాక అక్క‌డ వ‌రుస‌గా ఐటమ్ నంబ‌ర్ల‌తో అద‌ర‌గొట్టింది. సౌత్ లో తెలుగు ఇండ‌స్ట్రీలోనూ పాపులారిటీ సంపాదించింది. నోరా మ్యూజిక్ ఆల్బ‌మ్స్ అంతే క్రేజీగా వైర‌ల్ అవుతున్నాయి.

త‌న‌దైన‌ ఫ్యాషన్ స్టేట్ మెంట్ .. డ్యాన్స్ స్కిల్స్ తో అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంది. ఆమె ఆన్-పాయింట్ లుక్స్ కోసం సినీ ఫోటోగ్రాఫ‌ర్లు చకోర ప‌క్షుల్లా వేచి చూస్తారంటే త‌న‌కు ఎంత క్రేజు ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. నోరా సోషల్ మీడియా పోస్టులు క్ష‌ణాల్లో అంత‌ర్జాలాన్ని సునామీలా చుట్టేస్తాయి. ఇంత‌కుముందే ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోషూట్ నుండి కొన్ని తాజా చిత్రాలను పంచుకుంది. ఇది ప్రింట్-ఆన్-ప్రింట్ స్పిన్ ఆఫ్ డిజైన‌ర్ లుక్.. ఎంతో స్పెష‌ల్ గా ఆక‌ర్షిస్తోంది. లో-నెక్ లైన్ క్రాప్ టాప్ తో పాంట్ సూట్ ధరించి గ్లామర్ ఎలివేష‌న్ క‌ట్టి ప‌డేస్తోంది. గజిబిజి వెట్ హెయిర్ తో క్రీగంటి చూపుల‌తో యూత్ గుండెల్ని నోరా కొల్ల‌గొడుతోంది. ``నా శత్రువు నాకు తెలుసు కాబట్టి నాకోసం ప్రార్థించండి ..`` అంటూ చిలిపి వ్యాఖ్య‌ను నోరా జోడించింది.

ఇటీవ‌లే నోరా స్పెష‌ల్ సాంగ్ `ఓ సాకి సాకీ...` అంత‌ర్జాలాన్ని షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. నోరా ఫతేహి చివరిసారిగా వరుణ్ ధావన్ .. శ్రద్ధా కపూర్ లతో ‘స్ట్రీట్ డాన్సర్’ లో కనిపించారు. ఆమె తదుపరి ప్రాజెక్ట్ అభిషేక్- దుధయ్య. అజయ్ దేవ్ గన్- సోనాక్షి సిన్హా- సంజయ్ దత్ ల‌తో కలిసి ఇందులో నటించింది.