Begin typing your search above and press return to search.

వైట్ అండ్ వైట్ లో రాణీ హంస‌లా దిగిన మ‌నోహ‌రి

By:  Tupaki Desk   |   19 Jun 2021 1:30 AM GMT
వైట్ అండ్ వైట్ లో రాణీ హంస‌లా దిగిన మ‌నోహ‌రి
X
అందాల నోరా ఫ‌తేహి ముంబైలో అడుగు పెట్టింది మొద‌లు కెరీర్ ప‌రంగా వెనుతిరిగి చూసిందే లేదు. త‌న‌దైన ముగ్ధ‌మ‌నోహ‌ర రూపం డ్యాన్సింగ్ ట్యాలెంట్ తో ఈ మొరాకో బ్యూటీ యూత్ లో అసాధార‌ణ ఫాలోయింగ్ పెంచుకుంది. ప్ర‌స్తుతం ఉత్త‌రాది ద‌క్షిణాది అనే తేడా లేకుండా భార‌త‌దేశ‌మంతటా గొప్ప అందాల‌ దేవ‌త‌గా వెలిగిపోతోంది. ఇక బాహుబ‌లి మ‌నోహ‌రిగా సౌత్ కి బాగా క‌నెక్ట‌యిపోయింది.

నోరా ఇప్ప‌టికిప్పుడు సూప‌ర్ గాళ్ గా పాన్ ఇండియ‌న్ సినిమా చేస్తే క‌చ్ఛితంగా అది అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు. మ‌రో వండ‌ర్ ఉమెన్ రేంజులో పాపులారిటీ ద‌క్కించుకునే స‌త్తా త‌న‌కు ఉంద‌ని విశ్వ‌సిస్తోంది. ఆ ఒక్క ఛాన్స్ కోసం వేచి చూస్తాన‌ని ఇంత‌కుముందు నోరా వెల్ల‌డించింది. స్వ‌త‌హాగానే నోరా అథ్లెటిక్ లుక్.. ఫ్లెక్సిబిలిటీ ఆ స్థాయిలోనే ఎలివేట్ అవుతుంది. ఇక నోరా ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు

మ‌నోహ‌రి ఒక్క‌సారి అలా వీధిలోకి వ‌చ్చిందంటే చాలు ముంబై కెమెరా క‌ళ్లు జూమ్ లోకి వెళ‌తాయి. నోరాజీ నోరాజీ ప్లీజ్ ప్లీజ్ అంటూ స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్లు త‌న వెంటే ప‌డ‌తారు. తాజాగా వైట్ అండ్ వైట్ లో రాణీ హంస‌లా అలా వీధిలో షికార్ కి వ‌చ్చి కార్ దిగిన నోరా వెంట బ‌తిమాలుతూ వెంబ‌డించారు ఫోటోగ్రాఫ‌ర్స్. అలా ఆ క్ష‌ణం జిల్ల‌నిపించే లుక్ తో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇంకా ఫోటో సెష‌న్ ముగియ‌క ముందే భాయ్ అంటూ వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ గా మారింది. నోరా అద్భుతమైన క్రాప్-టాప్ డ్రెస్ లో థై స్లిట్ లుక్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది ఈ బ్యూటీ. ఓ ఫిలిం స్టూడియో లోపలికి వెళ్ళే ముందు ఒక్క క్ష‌ణం అలా పాజ్ ఇచ్చి పోజులిచ్చింది.

దిల్బార్-ఓ సాకి సాకి- ఏక్ తోహ్ కుమ్ జిందగాని - పెపేట లాంటి చార్ట్ బ‌స్ట‌ర్ పాట‌ల‌తో ఇటీవ‌ల‌ నోరా పాపులారిటీ అమాంతం పెరిగింది. సినీ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే నోరా `స్ట్రీట్ డాన్సర్ 3 డి` లో కనిపించింది. పాన్ ఇండియా మూవీ `భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా` లో కనిపించనుంది. ఈ చిత్రం OTT విడుదలకు సిద్ధంగా ఉంది.