Begin typing your search above and press return to search.

వీడియో: బెల్లీ డ్యాన్స్ తో ఇర‌గదీసిన నోరా

By:  Tupaki Desk   |   14 Nov 2021 12:30 AM GMT
వీడియో: బెల్లీ డ్యాన్స్ తో ఇర‌గదీసిన నోరా
X
హాట్ ఐట‌మ్ గాళ్ నోరా ఫతేహి `కుసు కుసు` మ్యూజిక్ వీడియో కోసం  ధరించిన డిజైన‌ర్ డ్రెస్ ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్ స‌హా అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. అబు జానీ- సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన దుస్తుల్ని ధ‌రించి నోరా బెల్లీ డ్యాన్స్ తో అద‌ర‌గొట్టింది. తాజాగా ఈ ఫోటోల‌తో పాటు బెల్లీ డ్యాన్స్ వీడియోని నోరా ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇవ‌న్నీ వైర‌ల్ గా మారాయి.

తాజా మ్యూజిక్ వీడియో కుసు కుసుతో మరోసారి నోరా రికార్డులను బద్దలు కొట్టింది. జాన్ అబ్రహం త‌దుప‌రి చిత్రం సత్యమేవ జయతే 2లోని ఈ కొత్త పాటలో తన అసాధార‌ణ‌ నృత్య కదలికలతో నోరా వేడెక్కించింది. ప్ర‌స్తుతం ఈ డ్యాన్సింగ్ ప్రోమో వీడియో కేవ‌లం 24 గంట‌ల్లోనే 22 మిలియ‌న్ల వ్యూస్ తో రికార్డులు బ్రేక్ చేసింది. పూర్తిగా కస్టమ్ బెల్లీ డ్యాన్స్ కాస్ట్యూమ్ తో ఇంటర్నెట్ ని ఇది షేక్ చేసింద‌ని చెప్పాలి.

``ఇవి మరోప్రపంచానికి సంబంధించినవి.. మూడ్`` అనే క్యాప్షన్ తో నోరా ఈ ఫోటోలను పోస్ట్ చేసింది. ఎంతో అద్భుతంగా డిజైన్ చేసిన‌ బ్రాలెట్ కి స‌రితూగే స్కర్ట్.. దానికి సరిపోయే ఇతర ఉపకరణాలు ధరించి ఎంతో అందంగా క‌నిపించింది నోరా. ఏస్ డిజైనర్లు అబు జానీ - సందీప్ ఖోస్లా ఈ డ్రెస్ ని రూపొందించారు. డిజైనర్ ద్వయం తరచుగా నోరాతో కలిసి పని చేస్తుంటార‌న్న సంగ‌తి తెలిసిన‌దే. ప్రతిసారి వారి నుంచి వ‌చ్చే  లుక్ మాయాజాలం సృష్టిస్తుంది.